NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Trump- Powell: పావెల్‌ పనితీరుపట్ల మండిపడ్డ ట్రంప్‌.. తొలగిస్తామని పరోక్ష హెచ్చరిక 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Trump- Powell: పావెల్‌ పనితీరుపట్ల మండిపడ్డ ట్రంప్‌.. తొలగిస్తామని పరోక్ష హెచ్చరిక 
    పావెల్‌ పనితీరుపట్ల మండిపడ్డ ట్రంప్‌.. తొలగిస్తామని పరోక్ష హెచ్చరిక

    Trump- Powell: పావెల్‌ పనితీరుపట్ల మండిపడ్డ ట్రంప్‌.. తొలగిస్తామని పరోక్ష హెచ్చరిక 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2025
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌ను వెంటనే తొలగించకూడదన్న సూచనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా తెలియజేశారు.

    ఆయన వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచిన ట్రంప్, ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తుండగా అమెరికా మాత్రం తాను కోరిన రీతిలో వాటిని తగ్గించకపోవడాన్ని తప్పుపట్టారు.

    తాజాగా జరిగిన ఒక సమావేశంలో పావెల్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా కదలవచ్చని హెచ్చరించారు.

    వినియోగ వ్యయాల్లో మందగమనం చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి వాణిజ్య రంగంలో ఆందోళనకు కారణమవుతోందని చెప్పారు.

    వివరాలు 

    వేగంగా వడ్డీరేట్లు తగ్గించాలని ఆశిస్తున్న: ట్రంప్ 

    ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని, అందువల్ల వడ్డీ రేట్ల కోతలో ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి ఆతురత చూపదని పావెల్ స్పష్టం చేశారు.

    అయితే ట్రంప్ మాత్రం వేగంగా వడ్డీరేట్లు తగ్గించాలని ఆశిస్తున్నారు.

    ఇమిగ్రేషన్, పన్నులు, ఆర్థిక నియంత్రణలు, దిగుమతులపై సుంకాల వంటివి ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవాలని ఫెడ్ కోరుతోందని పావెల్ చేసిన వ్యాఖ్యల అనంతరం ట్రంప్ స్పందించారు.

    యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే వడ్డీరేట్లను తగ్గించిందని ఆయన గుర్తుచేశారు. ఆ దిశగా జెరోమ్ పావెల్ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

    వివరాలు 

    2026 చివరివరకు పావెల్ పదవీ కాలం

    పావెల్ పదవీ కాలం 2026 చివరివరకు కొనసాగుతుంది.

    ఆయనను ట్రంప్ 2017లో ఫెడ్ చైర్మన్‌గా ప్రతిపాదించగా, తర్వాత 2022లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరో నాలుగేళ్లపాటు పదవిలో కొనసాగించారు.

    ప్రస్తుతం పావెల్ తొలగింపు విషయంలో త్వరిత నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్న అభిప్రాయాన్ని ట్రంప్ పరోక్షంగా తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    డొనాల్డ్ ట్రంప్

    Trump: భారత్‌ను ఉదాహరణగా చూపుతూ..అమెరికా ఎన్నికల ప్రక్రియలో ట్రంప్ భారీ మార్పులు..ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం  అంతర్జాతీయం
    Donald Trump: ట్రంప్‌ కీలక నిర్ణయం.. విదేశీ తయారీ కార్లపై 25% సుంకం  అంతర్జాతీయం
    Tata Motors: టాటా మోటార్స్‌ షేర్లు 6శాతం పతనం.. ట్రంప్‌ నిర్ణయంతో పెట్టుబడిదారుల ఆందోళనలు టాటా మోటార్స్
    America: యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థిని అరెస్ట్‌.. బేడీలు వేసి తీసుకెళ్లిన వీడియో వైరల్ అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025