
Trump-China: 'నేను ఆ కార్డ్స్ ఆడితే'.. చైనాతో వాణిజ్య యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బీజింగ్‌తో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నామని స్పష్టం చేసిన ఆయన, అయితే, చైనా కంటే తమ ఆధిపత్యమే ఎక్కువన్నారు. ఈ విషయంలో పోటీకొస్తే చైనా భారీ నష్టాలు తప్పవని పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. అంతేకాదు, అరుదైన ఖనిజాల సరఫరాను చైనా అడ్డుకుంటే, ఆ దేశంపై 200 శాతం సుంకాలు విధించడానికి అమెరికా వెనుకాడదని ట్రంప్ స్పష్టం చేశారు.
వివరాలు
ఇరుదేశాల మధ్య అద్భుత సంబంధాలు
'ఈ ఏడాది చివర్లో లేదా ఆ తర్వాత కొంతకాలానికి నేను చైనా పర్యటనకు వెళ్తా. ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయని భావిస్తున్నాను. కానీ, ప్రస్తుత వాణిజ్య వివాదాల్లో అమెరికా స్థితి చైనాపై మరింత బలంగా ఉంది. వాళ్ల దగ్గర (చైనాను ఉద్దేశిస్తూ) కొన్ని కొన్ని కార్డులు ఉన్నాయి. మన దగ్గర మరింత శక్తివంతమైన సాధనాలు ఉన్నాయి. అయితే వాటిని ఉపయోగించాలనుకోవడం లేదు. ఒకవేళ ఆడితే చైనాకు విపత్తే తప్పదు. అందుకే ఆ సాధనాలను ఇప్పటికిప్పుడు ఉపయోగించకూడదనుకుంటున్నాను'' అని ట్రంప్ వెల్లడించారు.