
Donald Trump: భారత్‌పై ట్రంప్ ఆక్రోశం.. మరిన్ని సుంకాలు విధిస్తా..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధించిన ఆయన, తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ విస్తృతంగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును బహిరంగ మార్కెట్‌లో తిరిగి విక్రయించి లాభాలు కూడగట్టుకుంటోందని విమర్శించారు. ఇలా భారత్ భారీగా చమురు కొనడం వలన రష్యాకు ఆర్థికంగా మద్దతు లభిస్తోందని,అదే కారణంగా రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ ఆరోపించారు.
వివరాలు
ట్రంప్ ప్రకటించిన 25 శాతం ప్రతీకార సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి..
ఉక్రెయిన్‌లో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, రష్యా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్రంప్ తన స్వంత సోషల్ మీడియా వేదిక అయిన "ట్రూత్ సోషల్"లో స్పందించారు. ''ఉక్రెయిన్‌లోని ప్రజలు ఎంతగా నష్టపోతున్నారో ఎవ్వరికీ పట్టడం లేదు. అందుకే భారత్‌పై మేము మరింత కఠినమైన సుంకాలను విధించబోతున్నాం'' అని స్పష్టం చేశారు. ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన 25 శాతం ప్రతీకార సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత్‌పై ట్రంప్ మరిన్ని సుంకాలు
#BREAKING: US President Donald Trump announces that he will be substantially raising the Tariffs against India. pic.twitter.com/SMKjpIdkT8
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 4, 2025