
ఇజు దీవులలో 6.6 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీచేసిన జపాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇజు చైన్‌లోని వెలుపలి ద్వీపాల్లో 6.6తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత జపాన్ వాతావరణ సంస్థ గురువారం సునామీ హెచ్చరికను జారీ చేసింది.
జపాన్‌లోని ప్రధాన ద్వీపమైన హోన్షుకు దక్షిణంగా విస్తరించి ఉన్న ద్వీపాలలో ఒకమీటరు ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
తూర్పున టోక్యో చుట్టూ ఉన్న చిబా ప్రిఫెక్చర్ నుండి పశ్చిమాన కగోషిమా ప్రిఫెక్చర్ వరకు విస్తరించి ఉన్న పెద్ద ప్రాంతానికి హెచ్చరిక వర్తింపజేయడంతో,హోన్షులో 0.2 మీటర్ల వరకు చిన్న సునామీ ఉప్పెనలు వచ్చే అవకాశం ఉంది.
హచిజో ద్వీపంలోని యానే ప్రాంతంలో దాదాపు 30సెం.మీ చిన్న సునామీ ఏర్పడిందని వాతావరణసంస్థ తెలిపింది.
పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK ప్రకారం,అక్కడి నిర్వాసితులు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సునామీ హెచ్చరిక జారీచేసిన జపాన్
BREAKING: Tsunami advisory issued for Izu Islands of Japan after magnitude 6.6 earthquake hits near Torishima pic.twitter.com/QdzRLKHBB3
— Truthseeker (@Xx17965797N) October 5, 2023