
North Korea: ఉక్రెయిన్ సంచనల ఆరోపణలు.. రష్యా ఆయుధాల్లో 40శాతం ఉత్తరకొరియానే!
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా భారీ మద్దతు అందిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కైరులా బుడనోవ్ చేసిన ప్రకటన ప్రకారం - రష్యా యుద్ధంలో ఉపయోగిస్తున్న అయుధాల్లో దాదాపు 40 శాతం ఉత్తరకొరియాదే అని ఆరోపించారు.
Details
పుతిన్-కిమ్‌ల మిలిటరీ ఒప్పందం ప్రభావం
గత ఏడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మిలిటరీ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం ఉత్తరకొరియా నుంచి రష్యాకు బాలిస్టిక్ క్షిపణులు, ఫిరంగులు, ఇతర మిలిటరీ వ్యవస్థలు చేరుతున్నాయి. వీటి బదులుగా రష్యా ఉత్తరకొరియాకు పెద్ద మొత్తంలో నగదు, టెక్నాలజీ అందజేస్తోందని బుడనోవ్ వెల్లడించారు.
Details
మాస్కోకు సైనిక మద్దతు - ఉత్తరకొరియా అగ్రపథంలో
కేవలం ఆయుధాలు సరఫరా చేయడమే కాకుండా, ఉత్తరకొరియా సైనిక మద్దతు కూడా పెంచుతోంది. మరో 30,000 మంది ఉత్తరకొరియా సైనికులను మాస్కోకు మద్దతుగా పంపేందుకు కిమ్ సిద్ధమయ్యారని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2023 నవంబర్‌లో ఉక్రెయిన్ సేనలు క్రుస్క్‌లోకి చొచ్చుకురావడంతో అప్పటికే 11,000 మంది ఉత్తరకొరియా సైనికులను పంపించినట్లు సమాచారం.
Details
కాల్పుల విరమణకు ట్రంప్ ప్రయత్నాలు
ఇక యుద్ధం ముగిసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరాయత్నాలు చేస్తున్నారు. పుతిన్‌తో ఫోన్ సంభాషణలు జరిగినప్పటికీ వీటిలో పురోగతి లేకపోవడంతో ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారు. గతంలో ఆయుధ నిల్వలు తక్కువగా ఉన్నాయని చెబుతూ ఉక్రెయిన్‌కు అమెరికా ఇచ్చే ఆయుధాలను నిలిపివేశారు. అయితే పరిస్థితులు మారిన నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం తిరగేసి పుతిన్ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాడు, కాబట్టి కీవ్‌కు మళ్లీ ఆయుధాల సహాయం అవసరం అంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధం క్రమంగా భౌగోళిక రాజకీయ యుద్ధంగా మారుతోంది. ఉత్తరకొరియా-రష్యా మిలిటరీ భాగస్వామ్యం, అమెరికా సపోర్టు యూటర్న్ - ఇవన్నీ ముందున్న పరిణామాలను తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది.