Page Loader
United Nations: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపై ఐక్యరాజ్యసమితి రియాక్షన్.. 

United Nations: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపై ఐక్యరాజ్యసమితి రియాక్షన్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 29, 2024
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను ఫ్రీజ్‌ చేయటం లాంటి అంశాలపై అమెరికా స్పందించగా..భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు కూడా జరీ చేసింది.ఇక,ఒక్క రోజు వ్యవధిలోనే ఐక్యరాజ్య సమితి ఈ విషయమై స్పందించింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు,కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభనతో నెలకొన్న రాజకీయఅనిశ్చితిపై UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పందించారు.

Details 

ఈ అంశాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహరం

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో,ఎన్నికలు జరిగే ఏ దేశంలోనైనా, రాజకీయ, పౌర హక్కులతో సహా ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా,న్యాయమైన వాతావరణంలో ఓటు వేస్తారని నమ్ముతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించింది. అలాగే, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అకౌంట్లపై అమెరికా రెండో సారి స్పందించటం గమనార్హం. అయితే, దీనిపై కూడా భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే, ఈ అంశాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహరం అని స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ప్రతి ఒక్క దేశం గౌరవించాలని భారత్ పేర్కొంది.