
ట్రంప్‌కు 1,20,000 డాలర్లు చెల్లించాలని పోర్న్‌స్టార్ డేనియల్స్‌ను ఆదేశించిన అమెరికా కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
పోర్ట్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు మంగళవారం కాలిఫోర్నియాలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు షాకిచ్చింది. పరువు నష్టం కేసులో ఓడిపోయినందున డొనాల్డ్ ట్రంప్‌కు 1,20,000డాలర్లు చెల్లించాలని డేనియల్స్‌ను ఆదేశించింది.
స్టార్మీ డేనియల్స్‌తో శారీరక సంబంధాన్ని కప్పిపుచ్చడానికి హష్ మనీ చెల్లింపులు సహా 34ఆరోపణల్లో విచారణ కోసం న్యూయార్క్‌లోని మాన్‌హాటన్ కోర్టులో ట్రంప్ లొంగిపోయిన రోజే, ఆయనకు అనుకూలంగా ఈ తీర్పు రావడం గమనార్హం.
ట్రంప్ న్యాయవాదులకు 120,000డాలర్లను లీగల్ ఫీజుగా చెల్లించాలని 9వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ డేనియల్స్‌ను ఆదేశించింది.
2018లో ట్రంప్‌తో తనకున్న శారీరక సంబంధాన్ని డేనియల్స్‌బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఆ వ్యాఖ్యలపై అప్పుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం డేనియల్స్‌తనపై ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడ్డారు.
డొనాల్డ్ ట్రంప్
మూడు సార్లు ఓడిపోయిన సృంగార తార డేనియల్స్
ట్రంప్ చేసిన ఆరోపణలను ఖండించిన డేనియల్స్ అతనిపై కోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఈ క్రమంలో కోర్టు విచారణలో డేనియల్స్ ఓడిపోయారు. దీంతో ట్రంప్‌కు 293,000లీగల్ ఫీజుగా చెల్లించాలని కోర్టు డానియల్స్‌ను ఆదేశించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆమె పై కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా డానియల్స్‌కు చుక్కెదురైంది. ఆ కోర్టు మరో 245,000డాలర్లు చెల్లించాలని ఆదేశించినట్లు సీఎన్ఎన్ నివేదించింది.
ఆ తీర్పును కూడా సవాల్ చేస్తూ ఫెడరల్ అప్పీల్ కోర్టును డేనియల్స్ ఆశ్రయించింది. ఈ కోర్టు కూడా ఆమెకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. అదనంగా మరో 1,20,000డాలర్లు లిగల్ ఫీజు చెల్లించాలని అదేశించింది.
ఈ కేసులో లీగల్ ఫీజు నిమిత్తం ట్రంప్‌నకు 6లక్షల డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.