2024 US elections: తొలి ఫలితాల్లో ట్రంప్ ముందంజ.. జార్జియాలో ఎదురీతున్న కమలా ..?
అమెరికా ఎన్నికల్లో మొదటి ఫలితాలు వెలువడిన సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ వెనుకబడ్డారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.00 గంటల సమయానికి, ఓక్లహోమా, మిస్సోరీ, ఇండియానా, కెంటకి, టెన్నసీ, అలబామా, ఫ్లోరిడా, వెస్ట్ వర్జీనియా, దక్షిణ కరోలైనా, అర్కాన్సస్ వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. దీంతో ట్రంప్‌కు 101 ఎలక్టోరల్ సీట్లు లభించినట్లు కనిపిస్తోంది.
కమలా హారిస్‌కు 71 ఎలక్టోరల్ సీట్లు
ఇదే సమయంలో, డెమోక్రటిక్ పార్టీ మేరీల్యాండ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, వెర్మాంట్ రాష్ట్రాల్లో ఆధిక్యంలో నిలిచింది. దీంతో కమలా హారిస్‌కు 71 ఎలక్టోరల్ సీట్లు లభించినట్లు ఉంది. అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా హారిస్ వ్యతిరేక అభిప్రాయాలను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్స్‌కు 16 ఎలక్టోరల్ ఓట్లు సాధించింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో, ముఖ్యంగా పిట్స్‌బర్గ్, ఫిలడెల్ఫియా ప్రాంతాల్లో ఆమె ముందంజలో ఉన్నారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.