Page Loader
Trade deal: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి
భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి

Trade deal: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరెంతో దూరంలో లేదని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావంగా తెలిపారు. వాషింగ్టన్‌లో నిర్వహించిన భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (Strategic Partnership Forum) నాయకత్వ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికాల మధ్య పరస్పర ప్రయోజనాలను గుర్తించి, వాటిని ముందుకు తీసుకెళ్లే దిశగా ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.

వివరాలు 

భారతదేశం కూడా ఈ ఒప్పందంపై ఆసక్తి

ఈ వ్యాఖ్యలు, భారత్-అమెరికాల మధ్య చర్చలు తుదిదశకు చేరిన తరుణంలో రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాణిజ్య ఒప్పందంపై గత కొంతకాలంగా సాగుతున్న సంప్రదింపులు త్వరితగతిన సాగుతున్నాయని లుట్నిక్ స్పష్టం చేశారు. ''భవిష్యత్తులోనే భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం ప్రకటించబడే అవకాశముంది. భారత్ తమ తరఫున సరైన ప్రతినిధిని పంపిస్తే, మేము కూడా సముచితమైన ప్రతినిధిని చర్చలకు పంపుతాం. గతంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలకు మెరుగైన ఒప్పందాలు లభించాయి. జూలై 4 నుండి 9 తేదీల మధ్య అమెరికా చేరే వారికి ఆ అవకాశం ఉండొచ్చు,'' అని వివరించారు. భారతదేశం కూడా ఈ ఒప్పందంపై పెద్దఎత్తున ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదిత ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం చురుగ్గా స్పందిస్తోంది.

వివరాలు 

అమెరికా విధించిన ప్రతీకార సుంకాలను తొలగించేందుకు భారత్ కృషి

ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ.. ''ఇరుదేశాలు కలిసి పనిచేయాలన్నదిశలో ఒక అవగాహనకు వచ్చాయి.పరస్పర మార్కెట్లను పరస్పరం ప్రాధాన్యతనిస్తూ వాణిజ్యాన్ని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మేము సుస్థిరంగా పనిచేస్తున్నాం,'' అని వెల్లడించారు. అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధిబృందం ప్రస్తుతం న్యూఢిల్లీలో పర్యటిస్తోంది.వారి పర్యటన సందర్భంగా జరుగుతున్న చర్చలు జూన్ నెల చివరికి ఓ నిర్ణీత దిశలోకి వెళ్లే అవకాశముంది. ముఖ్యంగా అమెరికా విధించిన 26శాతం ప్రతీకార సుంకాలను తొలగించేందుకు భారత్ కృషి చేస్తోంది. మరోవైపు,గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా,భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 191బిలియన్‌ డాలర్ల స్థాయిలో నుండి 2030నాటికి 500బిలియన్‌ డాలర్లకు పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం.