
US-Palsitne-Proterst: పాలస్తీనా మద్దతుగా అమెరికాలో ఉధృతమవుతున్న ఆందోళనలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా విశ్వవిద్యాలయాలు అట్టుకుతున్నాయి.
పాలస్తీనాకు మద్దతుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.
యూనివర్సిటీలోని విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా నిరసలకు దిగుతున్నారు.
దీంతో అప్రమత్తమైన యూనివర్సిటీల యాజమాన్యాలు పోలీసులను రంగంలోకి దించాయి.
ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో పాటు నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను యూనివర్సిటీలు సస్పెండ్ చేస్తున్నాయి.
అయినప్పటికీ విద్యార్థులు ఆందోళనలను విరమించడంలేదు.
తాజాగా ప్రిన్స్ టన్ యూనివర్సిటీ విద్యార్థులు నిరాహారదీక్షలకు దిగారు.
పాలస్తీనాకు సంబంధించి వర్సిటీ యాజమాన్యం తమ డిమాండ్లు నెరవేర్చేంతవరకు నిరాహారదీక్షలు కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు.
ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
అమెరికా మద్దతు ఉపసంహరించుకునేంత వరకు నీళ్లు తప్ప మరేమీ తీసుకోమని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.
US-Palsitne-Proterst
గాజాకు మద్దతిచ్చేవారంతా దీక్షలు చేయండి: విద్యార్థుల పిలుపు
గాజాకు మద్దతిచ్చేవారంతా నిరసన దీక్షలు చేపట్టాలని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ విద్యార్థులు పిలుపునిచ్చారు.
దీక్షలో పాల్గొనే వారంతా మంచినీళ్లు తప్ప ఇంకేమీ తీసుకోవద్దని సూచించారు.
పాలస్తీనాకు విముక్తి కల్పించేంత వరకు తాము దీక్ష కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు స్పష్టం చేస్తున్నారు.
పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని విద్యార్థులు చెబుతున్నారు.
ఇప్పటికే కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ యూనివర్సిటీల్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.
embed
పాలస్తానాకు మద్దతుగా నిరాహారదీక్షకు దిగిన విద్యార్థులు
Princeton students are doing a hunger strike. pic.twitter.com/2ywzbPOP37— Jack (@JackFought_1) May 3, 2024