LOADING...
America-sactions on Isreal: ఇజ్రాయెల్ పై అమెరికా మరిన్నిఆంక్షలు.. పోరాడతామంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
ఇజ్రాయెల్ పై అమెరికా మరిన్నిఆంక్షలు..

America-sactions on Isreal: ఇజ్రాయెల్ పై అమెరికా మరిన్నిఆంక్షలు.. పోరాడతామంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ

వ్రాసిన వారు Stalin
Apr 22, 2024
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్ (Israel)సైనిక దళాలపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. నెట్జా యెహూదా బెటాలియన్ పై ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కు ఆ వార్త అస్సలు మింగుడు పడలేదు. ఇప్పుడు తాజాగా ఇంకొన్ని ఇజ్రాయెల్ సైనిక దళాలపై మరిన్ని ఆంక్షలు అమెరికా విధించనుందన్న సమాచారం ఇప్పుడు ఇజ్రాయెల్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పాలస్తీనా పౌరులపై మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ లో కథనాలుగా వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇజ్రాయెల్ పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతుండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాత్రం అమెరికా నిర్ణయంపై మండిపడుతున్నారు.

Sanctions imposed on Israel

ఆంక్షలపై పోరాడతాం: ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహూ

ఉగ్రవాదులతో పోరాడుతున్న తమ సైనిక బెటాలియన్లపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయం కాదని నెతన్యాహూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా విధించే ఆంక్షలపైనా, ఉగ్రవాదుల పైనా తాము పోరాడతామని నెతన్యాహూ స్పష్టం చేశారు. అమెరికా గనుక ఆంక్షలు విధించినట్లైతే ఇజ్రాయెల్​ తమ ఆయుధాలకు సొంత నిధులు వెచ్చించాల్సి వస్తుంది. అమెరికా సైనిక సహాయం కూడా ఇజ్రాయెల్​ కు నిరాకరించబడుతుంది.