USA: ఉగ్రవాదంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను రెండు దేశాలు, చర్చల ద్వారా పరిష్కారించుకోవాలని అమెరికా సూచించింది. ఉగ్రవాదంపై మోదీ చేసిన 'ఘర్ మే గుస్ కే మారేంగే' ప్రకటనపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. "ఇంతకు ముందు చెప్పినట్లు ఈ రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకోవడం లేదు. కానీ ఉద్రిక్తతలను నివారించేందుకు ఆ దేశాలు చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొవాలని సూచిస్తున్నాం"అని పేర్కొన్నారు. కెనడాలో జరిగిన నిజ్జర్ హత్య,న్యూయార్క్‌లో గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికా గడ్డపై కుట్ర ఆరోపణలు,పాకిస్థాన్‌లో జరిగిన హత్యలకు సంబంధించి న్యూదిల్లీపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదని ప్రశ్నించగా..''ఇది మేం బహిరంగంగా చర్చించే అంశం కాదు'' అని మిల్లర్ సమాధానం ఇచ్చారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తగిన సమాధానం ఇస్తాం: రాజ్‌నాథ్ సింగ్
ఈ నెల ప్రారంభంలో, రాజ్‌నాథ్ సింగ్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం అనుసరిస్తున్న విధానంపై బలమైన ప్రకటనను విడుదల చేశారు. ఉగ్రవాదులు శాంతికి భంగం కలిగించడానికి లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తగిన సమాధానం ఇస్తామన్నారు. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు పారిపోతే భారత్ పొరుగు దేశంలోకి ప్రవేశించి వారిని చంపేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ సింగ్ మాటలను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. "దేశంలో మనకు బలహీనమైన ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మన శత్రువులు ప్రయోజనం పొందారు. ఈ బలమైన ప్రభుత్వంలో ఉగ్రవాదులు ఇళ్లలోకి చొరబడి చంపబడ్డారన్నారు.