
India: భారత నిఘా సంస్థ 'రా'పై ఆంక్షలు విధించాలని అమెరికా మత స్వేచ్ఛా కమిటీ సిఫార్సు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశానికి (India) చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) పై అమెరికా (USA) ఆంక్షల కత్తి వేలాడుతోంది
ఇటీవల 'యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్' సంస్థ 'రా'పై ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
సిక్కు వేర్పాటువాదుల హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడమే దీనికి కారణమని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది.
ఈ కమిషన్ మంగళవారం తమ వార్షిక నివేదికను విడుదల చేసింది.
ఇందులో భారత్‌పై మరిన్ని ఆరోపణలు చేసింది. మైనార్టీలు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.
మత స్వేచ్ఛ పరంగా భారత్‌ను ఆందోళనకర దేశంగా ప్రకటించాలని సూచించింది. 2024లో కూడా మతపరమైన మైనార్టీలపై వేధింపులు, దాడులు పెరిగాయని అభిప్రాయపడింది.
వివరాలు
'రా'పై ఎలాంటి చర్యలు తీసుకోదని నిపుణులు అంచనా
ఈ నివేదికపై భారత్ తక్షణ స్పందించలేదు. అయితే, ఈ సంస్థ ఇచ్చిన నివేదికను ట్రంప్ ప్రభుత్వాన్ని తప్పనిసరి పాటించాల్సిన అవసరం లేదు.
వియత్నాం కమ్యూనిస్ట్ పాలకులపై కూడా ఈ కమిషన్ విమర్శలు చేసింది.
మత వ్యవహారాలను ఆ దేశం నియంత్రిస్తోందని పేర్కొంది. అందువల్ల ఆ దేశాన్ని కూడా ఆందోళనకర జాబితాలో చేర్చాలని సూచించింది.
చైనాను అడ్డుకోవడానికి అమెరికా భారత్, వియత్నాం దేశాలతో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.
బీజింగ్‌ను నిరోధించేందుకు న్యూదిల్లీ కీలకమైన శక్తిగా ఉందని అమెరికా గత కొన్ని ఏళ్లుగా భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం భారత నిఘా సంస్థ 'రా'పై ఎలాంటి చర్యలు తీసుకోదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
అమెరికా,కెనడాలో సిక్కు వేర్పాటువాదులనే లక్ష్యంగా చేసుకున్న భారత్
2023లో అమెరికా, కెనడాలో సిక్కు వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకున్నట్లు భారత్‌పై ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్‌పై ఆరోపణలు మోపింది.
ఖలిస్థానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నినట్లు పేర్కొంది.
మరోవైపు, అమెరికాలో ఉంటూనే పన్నూన్ భారత ప్రభుత్వాన్ని బెదిరించే సందేశాలను విడుదల చేస్తూ వస్తున్నాడు.
సీఆర్పీఎఫ్ స్కూళ్లను, ఎయిర్ ఇండియా విమానాలను, కుంభమేళాను లక్ష్యంగా చేసుకోవాలని ఖలిస్థానీలకు పిలుపునిచ్చినట్లు సమాచారం.