USA: అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశిస్తే శిక్ష తప్పదు.. అమెరికా హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని డాలస్‌లోని ఓ మోటెల్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటనలో, అతను నాగమల్లయ్య తల నరికి, దాన్ని చెత్తబుట్టలో పడేశాడు.ఈ సంఘటన అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈనేపథ్యంలో అక్రమ వలసదారులపై కఠిన ఆంక్షలు అమలుచేయడానికి అగ్రరాజ్యం సిద్ధమవుతోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(DHS)ప్రకటన ప్రకారం,బైడెన్ పరిపాలన సమయంలో అక్రమ వలసదారుల ప్రవేశాన్ని సక్రమంగా నియంత్రించి ఉంటే ఈ దారుణం జరగకుండా ఉండేది. బాధిత కుటుంబసభ్యులు నేరస్థుడి క్రూరత్వాన్ని ప్రత్యక్షంగా చూసి తీవ్ర మనోవ్యధను ఎదుర్కొన్నారని DHS పేర్కొంది. "ఈ నేరస్థుడిని దేశంలోకి అనుమతించకపోతే ఇలాంటి దారుణానికి అవకాశమే ఉండేది కాదు"అని స్పష్టం చేశారు.
వివరాలు
మూడోస్థాయి దేశాల నేరస్థులను అమెరికా దాటిస్తున్నాం: డీహెచ్‌ఎస్
అనాగరిక నేరస్థుల ప్రవేశాన్ని నిరోధించడం ట్రంప్ పరిపాలనలో ముఖ్యమైన విధానమని డీహెచ్‌ఎస్ పేర్కొంది. అందుకే మూడోస్థాయి దేశాల నేరస్థులను అమెరికా దాటిస్తున్నామని తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది చట్టవిరుద్ధంగా మా దేశానికి వస్తే, ఎస్వాటిని, ఉగాండా, దక్షిణ సూడాన్, సెంట్రో ద కన్ఫినామింటో డెల్ టెర్రరిజం స్థావరానికి పంపిస్తాం' అని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ, అక్రమ వలసదారులపై మరింత కఠిన చర్యలు తీస్తామని హామీ ఇచ్చారు. చంద్ర నాగమల్లయ్య హత్య నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ క్రిమినల్ అభియోగాలు నమోదు చేసి తగిన విధంగా విచారణ చేపడతామని తెలిపారు.
వివరాలు
భార్య, కుమారుడు సమక్షంలో నేరస్థుడు హత్య
"అమెరికాను మళ్లీ సురక్షిత దేశంగా మార్చడం మా ప్రధాన లక్ష్యం" అని చెప్పారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న నిందితుడు క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడని స్పష్టం చేశారు. డాలస్‌లో మంచి పేరుగాంచిన వ్యక్తి అయిన మల్లయ్యను భార్య, కుమారుడు సమక్షంలో నేరస్థుడు హత్య చేశారని చెప్పారు. సెప్టెంబర్ 10న జరిగిన ఈ ఘోర ఘటన దేశం మొత్తం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని కలిగించింది. అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, న్యాయస్థానాలు, అంతర్జాతీయ సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నారు.