
USA: ఇండో-పసిఫిక్ పై చైనా దూకుడును సహించం.. అమెరికా హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఇండో-పసిఫిక్ భద్రతపై అమెరికా దృష్టి మరింతగా పెరిగుతోంది. తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సింగపూర్ పర్యటన సందర్భంగా చైనా చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆర్థిక, మిలిటరీ ఒత్తిడిని చూపుతోందని, దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తైవాన్‌ను టార్గెట్ చేస్తూ చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని హెగ్సెత్ హెచ్చరించారు. చైనా దూకుడుతో తైవాన్‌లో ఘర్షణకు దారితీసే పరిస్థితి నెలకొనవచ్చని ఆయన అంచనా వేశారు. భవిష్యత్తులో తైవాన్‌పై బీజింగ్ ముప్పు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని హెగ్సెత్ వ్యాఖ్యానించారు. చైనా యుద్ధ నౌకల చలనం, తైవాన్ చుట్టూ సముద్ర పరిసరాల్లో ఆర్మీ మోహరింపు బెదిరింపులకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.
Details
చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
చైనా ఏకపక్షంగా భౌగోళిక, సముద్ర హక్కుల వివాదాల్లో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ తరహా అప్రజాస్వామ్య చర్యలకు వ్యతిరేకంగా అమెరికా తన మిత్ర దేశాలకు రక్షణ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. అలాగే, పనామా కాలువపై చైనా పెంచుకుంటున్న ప్రభావాన్ని తగ్గించేందుకు యూరోపియన్ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని హెగ్సెత్ సూచించారు. రక్షణ ఖర్చులను స్థూల దేశీయోత్పత్తిలో కనీసం 5 శాతానికి పెంచాలని సూచించారు. ఇండో-పసిఫిక్ దేశాలకు అమెరికా మద్దతుతో అక్కడి ప్రభుత్వాలు పశ్చిమ దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సాంస్కృతిక, పర్యావరణ పరంగా స్వతంత్రంగా నిలబడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.