America: కాలిఫోర్నియాలో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ హతం.. బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 24, 2024
11:35 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో (USA) అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ సునీల్ యాదవ్ (Sunil Yadav) హత్యకు గురయ్యాడు. భారతదేశంలో పలు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న సునీల్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) హతమార్చింది. కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్ ప్రాంతంలో సునీల్ ఇంట్లోకి ప్రవేశించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షూటర్లు అతడిని కాల్చిచంపారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ఈ హత్య తమ పనేనని గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించింది.