NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Jeff Bezos: ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం.. వాషింగ్టన్‌ పోస్టుకు సమస్యలు..!
    తదుపరి వార్తా కథనం
    Jeff Bezos: ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం.. వాషింగ్టన్‌ పోస్టుకు సమస్యలు..!
    ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం.. వాషింగ్టన్‌ పోస్టుకు సమస్యలు..!

    Jeff Bezos: ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం.. వాషింగ్టన్‌ పోస్టుకు సమస్యలు..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 29, 2024
    12:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని వాషింగ్టన్ పోస్టు తీసుకొన్న నిర్ణయంపై ప్రముఖ businessman జెఫ్ బెజోస్ స్పందించారు.

    తన నిర్ణయాన్ని సమర్థిస్తూ, రాజకీయ మద్దతు పక్షపాత వైఖరిని సృష్టించగలదని పేర్కొన్నారు.

    దీంతో, ఈ పత్రిక దాదాపు 36 సంవత్సరాలుగా పాటిస్తున్న సంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది.

    తాను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ఏ అవగాహనకు కూడా రాలేదని బెజోస్ స్పష్టం చేశారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఓపెన్ ఎడ్‌ను ప్రచురించింది.

    "అధ్యక్ష అభ్యర్థులకు మద్దతు ఇచ్చినట్లయితే, అవి ఎన్నికల స్థాయిని ఏరకంగానూ పెంచలేవు. పెన్సిల్వేనియాలోని తటస్థ ఓటర్లు మా నిర్ణయానికి అనుగుణంగా ఓట్లు వేస్తారని చెప్పరు" అని ఆయన రాసుకొచ్చారు.

    వివరాలు 

    పత్రికను వీడిన 2,00,000 మంది డిజిటల్ చందాదారులు 

    గతవారం,ఈపత్రిక పబ్లిషర్ విల్ లెవిస్ తమ ఎడిటోరియల్ బోర్డు అమెరికా అధ్యక్ష అభ్యర్థులను ఎండార్స్ చేయదని ప్రకటించారు.

    ఈ ప్రకటన తీవ్ర కలకలం సృష్టించింది.తొలుత కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వాలని భావించిన వీరు, యజమాని బెజోస్ మాత్రం ఎండార్స్ చేయడం ఆపాలని నిర్ణయించారు.

    ఈ నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ బ్లూ ఆరిజిన్ ఏరోస్పేస్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

    ఈ కంపెనీ కూడా బెజోస్‌కు చెందినది.ఈనిర్ణయం తీసుకోవడానికి తాము ఎటువంటి లబ్ధిని ఆశించలేదని ఆయన తెలిపారు.

    మరోవైపు,ఈనిర్ణయానికి అనుగుణంగా సోమవారం మధ్యాహ్నానికి దాదాపు 2,00,000 మంది డిజిటల్ చందాదారులు పత్రికను వీడినట్లు అమెరికాకు ఎన్‌పీఆర్ కథనంలో పేర్కొంది.

    పత్రికకు ఉన్న 25లక్షల చందాదారుల్లో వీరు 8శాతం ఉంటారని అంచనా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    అమెరికా

    Narendra Modi: అమెరికాలో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలు.. బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభం నరేంద్ర మోదీ
    Trump Florida shooting: డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు.. నెల ముందు నుంచే స్కెచ్‌!  డొనాల్డ్ ట్రంప్
    Kamala Harris:అమెరికాలో కాల్పుల కలకలం.. కమలా హారిస్ ప్రచార కార్యాలయం ధ్వంసం  కమలా హారిస్‌
    Explained: ఐరన్‌ డోమ్‌ ఎలా పనిచేస్తుంది.. సక్సెస్ రేటు ఎంత? ఐరన్‌ డోమ్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025