
Shehbaz Sharif: మేము రాజీపడం.. ఉగ్రవాది తర్వాత భారత్‌కు పాక్ ప్రధాని హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.
ఈ పరిస్థితిలో న్యూఢిల్లీ తీసుకున్న నిర్ణయాలపై పాకిస్థాన్‌కు చెందిన పలువురు మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పందించారు.
పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని తెలిపారు.
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న షరీఫ్, దేశంలో నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందిస్తూ... 'పహల్గాంలో జరిగిన విషాదకర ఘటనకు మేము నిందితులమనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాం.
ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము శాంతిని ప్రోత్సహించాలనుకుంటున్నామని పేర్కొన్నారు.
Details
ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటాం
ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు
. అంతేకాకుండా భారత ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని నాశనం చేస్తామని చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా స్పందిస్తూ, 'మా భద్రత, సార్వభౌమత్వంపై ఎలాంటి రాజీ లేదు.
ఎలాంటి ముప్పునైనా ధీర్యంగా ఎదుర్కొంటామని షరీఫ్ అన్నారు.
సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేత విషయాన్ని ప్రస్తావిస్తూ... 'భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు.
ఈ చర్యలు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మేము చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు.
Details
గగనతలాన్ని మూసివేసిన పాక్
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ దాడికి పాకిస్థాన్‌కు కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫోర్స్' హస్తం ఉన్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది.
సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్... పాకిస్థాన్ పౌరులను దేశం విడిచిపెట్టాలని ఆదేశించింది.
దీనికి ప్రతిస్పందనగా పాక్ కూడా భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.