Page Loader
Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని
'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని

Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'తో దాయాది పాకిస్థాన్‌ తీవ్ర భయాందోళనకు గురైంది. ఈ సుదీర్ఘ సైనిక దాడుల్లో భారత మిలిటరీ ప్రవేశపెట్టిన క్షిపణుల బలంతో పాకిస్థాన్‌ వైమానిక దళం గంభీరంగా దెబ్బతింది. భారత సైన్యం ధ్వంసం చేసిన కీలకమైన శత్రు వైమానిక స్థావరాల ప్రభావం ఎట్టకేలకు పాక్‌ నోటే బయటపడింది. ఇప్పటి వరకు ఈ దాడులపై మౌనం పాటించిన పాక్‌ నేతలు.. ఇప్పుడు తాము ఎదుర్కొన్న నష్టాన్ని అంగీకరించారు. తాజాగా పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. శుక్రవారం రాత్రి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత దాడుల నేపథ్యంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులపై మాట్లాడారు.

Details

భారత్ దాడులతో నష్టపోయాం

"మే 9-10 మధ్య రాత్రి దాడులు ప్రారంభమైన కొద్ది సేపటికే తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ నాకు ఫోన్‌ చేశారు. రావల్పిండిలోని నూర్ ఖాన్‌ సహా ఇతర ప్రధాన స్థావరాలపై భారత దాడులు జరిగాయని చెప్పారు. ఆ సమయంలో మా వైమానిక దళం చైనా యుద్ధవిమానాలు, స్థానిక సాంకేతిక పరిజ్ఞానంతో స్పందించిందని షెహబాజ్‌ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో పాక్‌ అధినేత భారత దాడులు నిజమేనని, అవి తమకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయని స్పష్టంగా ఒప్పుకున్నట్టయింది.