తదుపరి వార్తా కథనం

Earthquake: జపాన్‌లో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
వ్రాసిన వారు
Stalin
Jan 01, 2024
01:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
నూతన సంవతర్సం వేళ.. జపాన్‌ను భూకంపం వణికించింది.
పశ్చిమ జపాన్ (western Japan)లో సోమవారం భారీ భూకంపం (earthquake) సంభవించింది.
రిక్టర్ స్కేలుపై 7.4 (7.4 magnitude) తీవ్రత నమోదైంది. దీంతో వాయువ్య తీరానికి సునామీ (tsunami) హెచ్చరికలను జారీ చేసినట్లు జపాన్ టైమ్స్ నివేదించింది.
దీంతో ప్రజలు త్వరగా తీర ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇషికావా, నీగాటా, తోయామా, యమగటా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలు త్వరగా ఖాళీ చేయాలన్నారు.
ఇషికావాలోని నోటో ద్వీపకల్పంలో 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జపాన్‌లో భూకంపం
🚨ALERT IN JAPAN 🚨
— Francesco (@FrancescoCiull4) January 1, 2024
Earthquake of magnitude 7.5 hits Japan
tsunami warning issued:
Reporthttps://t.co/NIdZIu9WqQ pic.twitter.com/FfoCwpHFtB