Page Loader
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. రాష్ట్రాల వారీగా ఓటింగ్  మొదలయ్యే సమయం ఇలా..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. రాష్ట్రాల వారీగా ఓటింగ్ మొదలయ్యే సమయం ఇలా..!

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. రాష్ట్రాల వారీగా ఓటింగ్  మొదలయ్యే సమయం ఇలా..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. కమలా హారిస్‌,డొనాల్డ్‌ ట్రంప్ మధ్య జరుగుతున్న ఈ ఉత్కంఠభరిత పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో అనే ఆసక్తి నెలకొంది. నవంబర్‌ 5న దేశవ్యాప్తంగా పోలింగ్‌ ప్రారంభమవుతుండగా, ప్రతి రాష్ట్రంలో పోలింగ్‌ సమయాలు వేర్వేరుగా ఉంటాయి. వివిధ కాలమానాలకు అనుగుణంగా రాష్ట్రాలవారీగా పోలింగ్‌ ప్రారంభ సమయాలు ఈ విధంగా ఉన్నాయి: ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే రాష్ట్రాలు: కనెక్టికట్‌, ఇండియానా, కెంటకీ, మైన్‌, న్యూహ్యాంప్‌షైర్‌, న్యూజెర్సీ, న్యూయార్క్‌, వర్జీనియా

వివరాలు 

పోలింగ్‌ ప్రారంభ సమయాలు

ఉదయం 6:30 గంటలకు: ఒహాయో, నార్త్‌ కరోలినా, వెస్ట్‌ వర్జీనియా, వెర్మాంట్‌ ఉదయం 7 గంటలకు: అలబామా, డెలవేర్‌, వాషింగ్టన్‌ డీసీ, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినోయీ, కాన్సస్‌, మేరీల్యాండ్‌, మసాచుసెట్స్‌, మిషిగన్‌, మిస్సోరి, పెన్సిల్వేనియా, రోడ్‌ ఐల్యాండ్‌, సౌత్‌ కరోలైనా, టెన్నెసీ ఉదయం 8 గంటలకు: ఆరిజోనా, అయోవా, లూసియానా, మిన్నెసోటా, సౌత్‌ డకోటా, నార్త్‌ డకోటా, ఓక్లహోమా, టెక్సాస్‌, విస్కాన్సిన్‌ గమనిక: ప్రతి రాష్ట్రంలో పోలింగ్‌ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. జనాభా, సంఖ్య, టైమ్‌ జోన్లను అనుసరించి, కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.