
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు.
"మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అనే నినాదంతో ఆయనకు అమెరికన్ల నుండి అపారమైన ఓట్ల మద్దతు లభించింది.
ఈ విజయం ద్వారా ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో, విజయానికి కావాల్సిన 270 ఓట్లను ట్రంప్ సాధించారు.
బుధవారం రాత్రి 11 గంటల సమయానికి ట్రంప్‌కు 294 ఎలక్టోరల్ ఓట్లు లభించగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 223 ఓట్లు పొందారు.
మొత్తంగా, ట్రంప్ 71,727,828 (50.9 శాతం) ఓట్లు గెలుచుకోగా, కమలా హారిస్ 66,836,253 (47.4 శాతం) ఓట్లు సాధించారు. ఈ విజయంతో ట్రంప్ శ్వేతసౌధంలో రెండోసారి అడుగుపెట్టబోతున్నారు.
వివరాలు
ప్రమాణస్వీకారానికి 11 వారాల సమయం
అయితే, దానికి ఇంకా సమయం ఉంది. అమెరికాలో గెలిచిన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయడానికి చాల సమయం పడుతుంది.
దీనికి సుమారు 11 వారాల సమయం పట్టుతుంది. అంటే, ఈ ఎన్నికలో విజయం సాధించిన వారు వచ్చే ఏడాది జనవరిలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
గతంలో, నవంబర్‌లో ఎన్నికైన అధ్యక్ష అభ్యర్థులు మార్చి 4వ తేదీని ప్రమాణ స్వీకారం చేసేవారు. దానికి నాలుగు నెలల సమయం పట్టేది.
అయితే, 1933లో 'గ్రేట్ డిప్రెషన్' సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల నుండి ప్రమాణ స్వీకారానికి మధ్య గ్యాప్‌ను మూడు నెలలపాటు తగ్గించారు.
వివరాలు
కంగ్రెషనల్ రిప్రజెంటేటివ్స్,సెనేటర్స్ ప్రమాణ స్వీకారం
ఈ సవరణ ద్వారా, నవంబర్‌లో ఎన్నికైన అధ్యక్షుడు జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించబడింది.
ఈ నిర్ణయానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. అధికార బదలాయింపుల కారణంగా, కొత్త అధ్యక్షుడు, అతని బృందం బృందం పాలనకు సిద్ధం కావడానికి ఈ సమయం ఇస్తారని సమాచారం.
2025 జనవరి 3న కొత్తగా ఎన్నికైన కంగ్రెషనల్ రిప్రజెంటేటివ్స్,సెనేటర్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
జనవరి 6న ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను లెక్కించడం కోసం కాంగ్రెస్ ప్రత్యేక సంయుక్త సమావేశం నిర్వహించబడుతుంది.
270 లేదా అంతకన్నా ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని దేశాధ్యక్షుడిగా ప్రకటిస్తారు.
అదే విధంగా, ఉపాధ్యక్షునికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. చివరకు, 2025 జనవరి 20న మధ్యాహ్నం దేశాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.