Page Loader
Gautam Adani indicted: అదానీ లంచం కేసు వ్యవహారం.. అమెరికా అధ్యక్ష భవనం స్పందన ఇదే..
అదానీ లంచం కేసు వ్యవహారం.. అమెరికా అధ్యక్ష భవనం స్పందన ఇదే..

Gautam Adani indicted: అదానీ లంచం కేసు వ్యవహారం.. అమెరికా అధ్యక్ష భవనం స్పందన ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 22, 2024
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ పారిశ్రామికవేత్త మరియు బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి సంబంధించి అమెరికాలో నమోదైన కేసు గ్లోబల్‌గా చర్చనీయాంశమైంది. భారత్‌లో సౌర విద్యుదుత్పత్తి ఒప్పందాల కోసం రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారని, ఆ నిధులు తప్పుడు సమాచారంతో అమెరికాలో సేకరించారని ఆరోపణలతో అదానీ సహా ఎనిమిది మందిపై కేసు నమోదైంది. ఈ విషయం పై అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం స్పందించింది. ''ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌, న్యాయశాఖ సరైన సమాధానం ఇవ్వగలవు'' అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌ తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు దృఢంగా ఉన్నాయని, ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు కలిసి అధిగమిస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

వివరాలు 

తప్పుడు సమాచారం ద్వారా నిధుల సేకరణ 

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీతో పాటు సాగర్‌ అదానీ, వినీత్‌ ఎస్‌.జైన్‌, అజూర్‌ పవర్‌ సీఈఓ రంజిత్‌ గుప్తా తదితరులు లంచాల పథకానికి కీలక పాత్రధారులని ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం (FCPA) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో గౌతమ్‌ అదానీ సహా మరికొందరిపై అమెరికా కోర్టు అరెస్ట్‌ వారంట్లు జారీ చేసినట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 20 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్ల లాభం కోసం సౌర విద్యుత్‌ కొనుగోలులో అధిక ధరలు పెట్టించి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.