
South Korea: దక్షిణ కొరియా నూతన సారథి లీ జే -మ్యుంగ్.. ఆయన ప్రస్థానం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లీ జే-మ్యుంగ్ విజయం సాధించడం వల్ల గత ఆరు నెలలుగా కొనసాగుతున్న రాజకీయ గందరగోళానికి ముగింపు లభించినట్టే చెప్పవచ్చు. మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ 2023 డిసెంబరులో అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో దేశం రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. తరువాత జరిగిన పరిణామాల్లో,యూన్‌పై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా,అది ఆమోదించబడింది. అయితే ఆ తీర్మానాన్ని రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలించడానికి సమయం తీసుకోవడంతో ఎన్నికల ప్రక్రియ కొద్దిగా ఆలస్యం అయింది. కానీ చివరికి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలోకి దిగిన 61 ఏళ్ల లీ జే-మ్యుంగ్‌ను గెలిపించి, అధికార పీపుల్స్ పవర్ పార్టీ అభ్యర్థి కిమ్ మూన్ సూన్‌ను ఓడించారు.
వివరాలు
పనిచేస్తూ..చదువుతూ..
ఈ ఫలితంతో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే శక్తులకు మద్దతు ఇవ్వబోమన్న సంకేతం పంపించారు. 1963లో ఓ బీద కుటుంబంలో జన్మించిన లీ జే-మ్యుంగ్,బాల్యాన్నే కష్టాల్లో గడిపారు. చిన్ననాటి నుండి బాల కార్మికుడిగా పనిచేస్తూ చదువు కొనసాగించారు. 1982లో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1986లో బార్ పరీక్షను ఉత్తీర్ణత సాధించి,న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఎక్కువగా పేదలు,కార్మికుల తరఫున న్యాయపోరాటాలు చేయడంతో మానవ హక్కుల న్యాయవాదిగా మంచి పేరు సంపాదించారు. 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించిన లీ మొదట్లో కొన్ని పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ,తర్వాత మేయర్,గవర్నర్ పదవుల్లో పనిచేసి తన పాలనాపరమైన సామర్థ్యాన్ని చాటారు.
వివరాలు
కడిగిన ముత్యం కాదు
2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి,కేవలం 0.73 శాతం ఓట్ల తేడాతో యూన్ సుక్ యోల్ చేతిలో ఓటమి పాలయ్యారు. లీపై పలుకేసులు నమోదు అయ్యాయి.వాటిలో కొన్ని తీవ్రమైన అభియోగాలుగా ఉన్నాయి. అధ్యక్షఅభ్యర్థిగా బరిలో ఉన్న సమయంలోనే ఆయనపై ఉన్న కేసుల విచారణను కోర్టులు తాత్కాలికంగా నిలిపివేశాయి. అధ్యక్ష పదవిలో ఉన్నంతకాలం ఈ కేసులు ముందుకు సాగకపోవచ్చు,ఎందుకంటే దక్షిణ కొరియా చట్టాల ప్రకారం అధ్యక్షుడికి న్యాయ పరిరక్షణ కల్పించబడుతుంది. 2024లో లీపై హత్యాయత్నం కూడా జరిగింది.ఓ వ్యక్తి ఆటోగ్రాఫ్ నెపంతో ఆయన మెడపై దాడి చేసి గాయపరిచాడు,దాంతో ఆయనకు రెండు గంటలపాటు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. మద్యం సేవించి వాహనం నడిపిన కేసు కూడా ఆయనపై నమోదైంది.
వివరాలు
ఉత్తర కొరియాతో దోస్తీ!
అంతేకాక,2018లో వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదురయ్యాయి. 2022 ఎన్నికల సమయంలో నమోదైన మరో కేసులో కోర్టు ఆయనకు ఏడేళ్ల శిక్ష విధించగా,అప్పీల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ తీర్పును సుప్రీం కోర్టు తిరస్కరించింది. లీ జే-మ్యుంగ్ రెండు కొరియా దేశాల ఐక్యత పట్ల బలమైన నమ్మకం ఉన్న నేత.ఉత్తర కొరియాతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇది గత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీసుకున్న విధానానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు లీకి అనుకూలంగా ఉన్నాయనుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉండటం కలిసొచ్చే అంశం. ట్రంప్ తొలిసారి అధ్యక్ష పదవిలోకి వచ్చినపుడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలు జరిపారు.
వివరాలు
ఉత్తర కొరియాతో దోస్తీ!
అందువల్ల లీ ప్రయత్నాలకు అమెరికా నుంచి పెద్దగా విరోధం ఉండకపోవచ్చు. అయినప్పటికీ, అమెరికా విధించిన ఆర్థిక సుంకాలు దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే, విశ్లేషకుల దృష్టిలో లీకి సమర్థ నాయకత్వం అవసరం, కాని ఆయన పాలన సరళి అంత సాఫీగా సాగుతుందని చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు.