US Congress: శాన్ ఫ్రాన్సిస్కో రేసులో నాన్సీ పెలోసితో తలపడుతున్న భారతీయ సంతతికి చెందిన సైకత్ చక్రవర్తి ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా డెమోక్రటిక్ పార్టీలో అత్యంత ప్రభావశీలమైన నాయకురాలిగా నాన్సీ పెలోసీ గుర్తింపు పొందారు.
ఇటీవల జరిగిన అధ్యక్ష రేసులో జో బైడెన్‌ను తప్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
గతంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి సవాల్ విసిరిన ఏకైక డెమోక్రాట్ కూడా ఆమెనే.
ఈసారి నాన్సీ ప్రాతినిధ్యం వహించే శాన్ ఫ్రాన్సిస్కో సీటులో భారతీయ మూలాలున్న వ్యక్తి కాంగ్రెస్ పోటీకి దిగారు. అతడే సైకత్ చక్రవర్తి.
వివరాలు
ఎన్నికల పోరును అధికారికంగా ప్రకటించని నాన్సీ పెలోసీ
సైకత్ గతంలో ప్రతినిధుల సభ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్‌కి ప్రచారం నిర్వహించారు.
అంతేగాక, డెమోక్రటిక్ పార్టీ ప్రముఖ నేత బెర్నీ సాండర్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది.
2026 మిడ్టెర్మ్ ఎన్నికల కోసం తన అభ్యర్థిత్వాన్ని 'ఎక్స్' (Twitter) వేదికగా ప్రకటించిన ఆయన, డెమోక్రటిక్ పార్టీలో కొత్త నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.
''నాన్సీ పెలోసీ కెరీర్‌లో ఆమె సాధించిన విజయాలను గౌరవిస్తాను. కానీ, 45 ఏళ్ల క్రితం ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాటి పరిస్థితులతో పోలిస్తే, ఇప్పుడు అమెరికా పూర్తిగా మారిపోయింది'' అని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, నాన్సీ పెలోసీ తన ఎన్నికల పోరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
వివరాలు
'బ్రాండ్ న్యూ కాంగ్రెస్' పొలిటికల్ యాక్షన్ కమిటీ స్థాపించారు
సైకత్ చక్రవర్తి 1986లో టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో బెంగాలీ మూలాలున్న కుటుంబంలో జన్మించారు.
2007లో హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
అనంతరం 'మాకింగ్ బర్డ్' అనే టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. అలాగే, ప్రముఖ పేమెంట్ ప్రాసెసింగ్ సంస్థ స్ట్రైప్‌లో వ్యవస్థాపక ఇంజినీర్‌గా పనిచేశారు.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించిన ఆయన, వెర్మాంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రచారంలో భాగమయ్యారు.
ఆ ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత, మరికొందరితో కలిసి 'బ్రాండ్ న్యూ కాంగ్రెస్' అనే పొలిటికల్ యాక్షన్ కమిటీని స్థాపించారు.
అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ న్యూయార్క్ సీటులో విజయం సాధించేందుకు కీలకంగా వ్యవహరించిన ఆయన, ఆమె క్యాంపెయిన్ మేనేజర్‌గా పనిచేశారు.
వివరాలు
'ప్లేబుక్ పవర్ లిస్ట్'లో స్థానం
అంతేకాకుండా, 'గ్రీన్ న్యూ డీల్' సంస్థలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.
2019లో ప్రముఖ మీడియా సంస్థ పొలిటికో విడుదల చేసిన 'ప్లేబుక్ పవర్ లిస్ట్'లో ఆయన స్థానం పొందారు.
అమెరికా రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే నాయకుల జాబితాలో ఆయనను చేర్చారు.