LOADING...
Trump: ట్రంప్‌ పెళ్లి వేడుకలో ఎప్‌స్టీన్‌ హడావుడి.. ఫొటోలు విడుదల చేసిన సీఎన్‌ఎన్‌ 
ట్రంప్‌ పెళ్లి వేడుకలో ఎప్‌స్టీన్‌ హడావుడి.. ఫొటోలు విడుదల చేసిన సీఎన్‌ఎన్‌

Trump: ట్రంప్‌ పెళ్లి వేడుకలో ఎప్‌స్టీన్‌ హడావుడి.. ఫొటోలు విడుదల చేసిన సీఎన్‌ఎన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగా మారింది. ఎన్నికల ప్రచార సమయంలో జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్‌ స్కాండు గురించి వివరాలను వెల్లడిస్తానంటూ చేసిన హామీ,ఇప్పుడు మాట తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో,ట్రంప్‌ వైఖరిలో గందరగోళం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా,అమెరికన్‌ మీడియా సంస్థలు ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌ సంబంధాలను వివరిస్తూ పాత ఫొటోలు,వివరాలను వెలికితీస్తున్నాయి. ఇటీవల వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఎప్‌స్టీన్‌ పుట్టినరోజు సందేశాన్ని బహిర్గతం చేయగా,న్యూయార్క్ టైమ్స్‌ మరొక కేసులో కళాకారిణి మారియా ఫార్మర్‌ అనుభవాన్ని ప్రచురించింది. తాజాగా,ట్రంప్‌ రెండో పెళ్లి వేడుకలో ఎప్‌స్టీన్‌ పాల్గొన్న దృశ్యాలను,ఫొటోలతో సహా ప్రముఖ ఛానల్‌ సీఎన్‌ఎన్‌ బహిర్గతం చేసింది. దీనితో "మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌"(మాగా)వర్గాలు ట్రంప్‌ను గట్టిగా విమర్శించసాగాయి.

వివరాలు 

ట్రంప్‌-ఎప్‌స్టీన్‌ కలిసికాలం గడిపిన పలు సందర్భాల ఫొటోలు,వీడియోలు 

అమెరికాలో భారీ సెక్స్‌ కుంభకోణానికి ఆధ్యుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు పెద్దగా సంబంధాలు లేవని అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతున్నా.. వాస్తవాలు మాత్రం భిన్నంగా వెలువడుతున్నాయి. తాజా కథనంలో సీఎన్‌ఎన్‌, ట్రంప్‌-ఎప్‌స్టీన్‌ కలిసికాలం గడిపిన పలు సందర్భాల ఫొటోలు, వీడియోలను బయటపెట్టింది. 1993లో న్యూయార్క్‌ నగరంలోని ప్లాజా హోటల్‌లో జరిగిన ట్రంప్‌ రెండో వివాహ వేడుకలో ఎప్‌స్టీన్‌ హాజరయ్యాడు. ఆ వేడుకలో తీసిన ఫొటోలు డాఫైడ్డ్‌ జోన్స్‌ అనే ఫొటోగ్రాఫర్‌ చిత్రీకరించారు.

వివరాలు 

విక్టోరియా సీక్రెట్‌ ఫ్యాషన్‌ షోలకు ట్రంప్‌, ఎప్‌స్టీన్‌లు కలిసి హాజరైన దృశ్యాలు

సీఎన్‌ఎన్‌ మరిన్ని ఆధారాల కోసం ఇతర ఆన్‌లైన్‌ ఆర్కైవ్‌లను కూడా పరిశీలించింది. అందులో 1990ల మధ్య నుంచి 2000ల మధ్యకాలంలో న్యూయార్క్‌లో జరిగిన విక్టోరియా సీక్రెట్‌ ఫ్యాషన్‌ షోలకు ట్రంప్‌, ఎప్‌స్టీన్‌లు కలిసి హాజరైన దృశ్యాలు కూడా దొరికాయి. ఆ కార్యక్రమాల్లో ఇద్దరూ పరస్పరం మాట్లాడుకుంటున్న దృశ్యాలు కూడా పత్రికలో ప్రస్తావించబడ్డాయి. అలాగే, 2002లో ట్రంప్‌ న్యూయార్క్‌ మ్యాగజైన్‌తో మాట్లాడినప్పుడు, ఎప్‌స్టీన్‌ను "అద్భుతమైన వ్యక్తి"గా అభివర్ణించారు. "తాను మహిళలను ఎంతగానో ఇష్టపడతానో, అతడూ అంతే స్థాయిలో ఇష్టపడతాడు" అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను రచించిన 'ట్రంప్‌: హౌ టు గెట్‌ రిచ్‌' అనే పుస్తకంలో కూడా జెఫ్రీ ఎప్‌స్టీన్‌ గురించి "మిస్టీరియస్ జెఫ్రీ" అంటూ ప్రస్తావించారు.

వివరాలు 

 సీఎన్‌ఎన్‌కు ట్రంప్ ఫోన్ 

ఇక వాల్‌స్ట్రీట్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం,ఎప్‌స్టీన్‌ 50వ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్‌ అతడికి శుభాకాంక్షల లేఖ పంపారు. అందులో "హ్యాపీ బర్త్‌డే, ప్రతి రోజు ఒక అద్భుతమైన రహస్యం కావచ్చు" అనే సందేశం రాసి ఉంది. 1980లలో ట్రంప్‌,ఎప్‌స్టీన్‌ ఇద్దరూ న్యూయార్క్‌,పామ్ బీచ్‌ల్లో జరిగిన పలువురు కార్యక్రమాలలో తరచూ కలుసుకునేవారు. అయితే, తర్వాతి కాలంలో ఒక ఆస్తి వివాదం కారణంగా ఈ ఇద్దరి మధ్య దూరం ఏర్పడినట్టు సమాచారం. తాజాగా ట్రంప్‌ రెండో పెళ్లికి సంబంధించిన ఫొటోలు మీడియాలో వెలుగులోకి రావడంతో ట్రంప్‌ స్వయంగా సీఎన్‌ఎన్‌కు ఫోన్‌ చేసి, "నన్ను ఆటపట్టిస్తున్నారా?" అంటూ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రిపబ్లికన్స్ ఎగైనెస్ట్ ట్రంప్ చేసిన ట్వీట్