LOADING...
Zuckerberg overtakes Bezos: జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్.. 2025 లో ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులు వీరే.. 
2025 లో ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులు వీరే..

Zuckerberg overtakes Bezos: జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్.. 2025 లో ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులు వీరే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడిగా మార్క్ జూకర్ బర్గ్ నిలిచారు. ఆయన సంపదలో ఒక్కసారిగా దాదాపు 12 శాతం వృద్ధి, అంటే 28.4 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన సంపద మొత్తం 268.4 బిలియన్ డాలర్లుగా (ఆగస్ట్ 2025 ప్రకారం) నమోదైంది. ఇది జెఫ్ బెజోస్ సంపద 247.4 బిలియన్ డాలర్లను మించి ఉంది. మార్క్‌ జుకర్‌బర్గ్‌కి మెటా కంపెనీలో సుమారు 13 శాతం వాటా ఉంది.

వివరాలు 

ఎలాన్ మస్క్‌  సంపద 403.5 బిలియన్ డాలర్లు!

ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. టెస్లా సీఈఓగా ఉన్న ఆయన సంపద ప్రస్తుతం 403.5 బిలియన్ డాలర్లు.ఈ స్థానం మస్క్‌ మే 2024 నుండి కాపాడుకుంటూ వస్తున్నారు. ఫోర్బ్స్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు (ఆగస్ట్ 1, 2025): ఎలాన్ మస్క్ (Tesla CEO) - 403.5 బిలియన్ డాలర్లు ల్యారీ ఎల్లిసన్ (Oracle అధినేత) - 306 బిలియన్ డాలర్లు మార్క్ జుకర్‌బర్గ్ (Meta CEO) - 268.4 బిలియన్ డాలర్లు జెఫ్ బెజోస్ (Amazon వ్యవస్థాపకుడు) - 247.4 బిలియన్ డాలర్లు ల్యారీ పేజ్ (Google సహ వ్యవస్థాపకుడు) - 158 బిలియన్ డాలర్లు జెన్సెన్ హువాంగ్ (NVIDIA CEO) - 154.8 బిలియన్ డాలర్లు

వివరాలు 

ఫోర్బ్స్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు (ఆగస్ట్ 1, 2025): 

సెర్గీ బ్రిన్ (Google సహ వ్యవస్థాపకుడు) - 150.8 బిలియన్ డాలర్లు స్టీవ్ బాల్మర్ (మైక్రోసాఫ్ట్ మాజీ CEO) - 148.7 బిలియన్ డాలర్లు వారెన్ బఫెట్ - 143.4 బిలియన్ డాలర్లు (గత నెలతో పోలిస్తే 1% తగ్గింది) బెర్నార్డ్ ఆర్నాల్ట్ - 142.9 బిలియన్ డాలర్లు (4.5 బిలియన్ పెరిగినప్పటికీ ర్యాంక్ తగ్గింది)

వివరాలు 

జుకర్‌బర్గ్ ఒక్క 2025లోనే 100 బిలియన్లకు పైగా సంపద పెంపు! 

2025లో ఇప్పటివరకు మార్క్ జూకర్ బర్గ్ సంపదలో 100 బిలియన్ డాలర్లకుపైగా వృద్ధి జరిగింది. ఇది బిలియనర్లలోనే అత్యధికంగా పెరిగిన సంపదలలో ఒకటి. బ్లూంబర్గ్ మే నెలలోనే జుకర్‌బర్గ్‌ను బెజోస్ కంటే పైగా ర్యాంక్ ఇచ్చినా, ఫోర్బ్స్ మాత్రం ఆగస్టులో అధికారికంగా అతడిని మూడవ స్థానంలో ఉంచింది. ఈ ర్యాంకింగ్‌ల మార్పులకు ప్రధాన కారణం - మెటా, అమెజాన్ షేర్ల ధరల మార్పులే. ఎందుకంటే వీరి సంపదలో ఎక్కువ శాతం వాటా ఆయా కంపెనీలలోని ఈక్విటీపై ఆధారపడి ఉంటుంది.