Page Loader
Kia Seltos : 2025 కియా సెల్టోస్.. హైబ్రిడ్ ఇంజిన్, కొత్త డిజైన్‌తో ఇండియన్ మార్కెట్లోకి..!
2025 కియా సెల్టోస్.. హైబ్రిడ్ ఇంజిన్, కొత్త డిజైన్‌తో ఇండియన్ మార్కెట్లోకి..!

Kia Seltos : 2025 కియా సెల్టోస్.. హైబ్రిడ్ ఇంజిన్, కొత్త డిజైన్‌తో ఇండియన్ మార్కెట్లోకి..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2024
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో తమ బెస్ట్-సెల్లింగ్ ఎస్‌యూవీ అయిన కియా మోటర్స్ సెల్టోస్‌ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను సిద్ధం చేస్తోంది. ఈ 2025 మోడల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. తాజాగా స్పై షాట్స్‌ ద్వారా ఈ కొత్త మోడల్‌ డిజైన్ గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2025 సెల్టోస్ మోడల్‌ ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే విస్తృతమైన ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుందని తెలుస్తోంది. కొత్త మోడల్‌లో ఫ్లాట్‌గా ఉన్న గ్రిల్‌కు వర్టికల్ స్లాట్‌లున్నాయి. ఇది మోడల్‌కు మరింత మసివ్‌ లుక్‌ను ఇవ్వనుంది. కియా సెల్టోస్‌ డిజైన్‌లో మరిన్ని మార్పులు కనిపించవచ్చు. 2025 కియా సెల్టోస్ లో కొత్త టెయిల్ లైట్ల డిజైన్, కియా ఈవీ5 మోడల్‌ నుండి ప్రేరణ తీసుకుంటుంది.

Details

అల్లాయ్ వీల్స్‌కి కొత్త డిజైన్‌ ఎలిమెంట్స్‌

ఈ టెయిల్ లైట్లు పొడవుగా ఉంటాయని, రియర్ విండోస్‌ నుంచి బంపర్‌ వరకు విస్తరించేలా ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్‌ పైని అల్లాయ్ వీల్స్‌కి కొత్త డిజైన్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. కొత్త వెర్షన్‌లో కస్టమర్స్‌కి క్యాబిన్, కార్గో స్పేస్‌ను అందించే అవకాశం ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, 2025 సెల్టోస్‌ హైబ్రిడ్ ఆప్షన్‌ను కూడా అందించగలదు. 1.6 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో పొందవచ్చు. ఇది 141 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. 158 బీహెచ్‌పీ టర్బో పెట్రోల్, 114 బీహెచ్‌పీ డీజిల్ ఇంజిన్లను కూడా కొత్త మోడల్‌లో కొనసాగించే అవకాశం ఉంది. 2025 కియా సెల్టోస్‌ ఎస్‌యూవీ మరిన్ని వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.