
Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల కారణంగా వాహనాల మైలేజ్ తగ్గిపోతోంది. దీంతోపాటు పెట్రోల్ ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థుతిలో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ వైపు దృష్టి పెట్టుతున్నారు. మీరు కూడా మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని యోచిస్తుంటే, సిటీ డ్రైవ్ కోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్ ఈ-స్కూటర్ల వివరాలు ఇవి. ముఖ్యంగా ఎక్కువ రేంజ్ ఈ స్కూటర్ల ప్రత్యేకత.
Details
బిగాస్ సీ12ఐ
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 125 కి.మీ రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 60 కిమీ/గంట. బ్యాటరీకి 36,000 కి.మీ లేదా 3 ఏళ్ల వారెంటీ ఉంటుంది. 0 నుండి 80 శాతం ఛార్జ్ కావడానికి సుమారు 3 గంటలు 15 నిమిషాలు పడుతుంది. మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 99,990 నుంచి రూ. 1,29,990 వరకు
Details
బజాజ్ చేతక్ 3501
బజాజ్ చేతక్ ఈవీ సిరీస్‌లో ఇది బెస్ట్ సెల్లింగ్ మోడల్. 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో సుమారు 155 కి.మీ రేంజ్ ఇస్తుంది. 0-80% ఛార్జ్ కావడానికి 3 గంటలు అవసరం. టాప్ స్పీడ్ 73 కిమీ/గంట. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.35 లక్షలు. టీవీఎస్ ఐక్యూబ్ ఇండియాలో వేగంగా మార్కెట్ షేర్ పెంచుకుంటున్న ఈ ఈ-స్కూటర్, టీవీఎస్ నుంచి అందుబాటులో ఉన్న ఏకైక ఈవీ మోడల్. ధర రూ. 94,000 నుంచి రూ. 1.31 లక్షల వరకు ఉంటుంది. 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 94 కి.మీ రేంజ్ ఇవ్వడమే కాకుండా, 3.5కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 145కి.మీ రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 75 కిమీ/గంట. 0-80% ఛార్జింగ్ సమయం 2 గంటలు 45 నిమిషాలు.
Details
ఏథర్ రిజ్టా
బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా పేరు గల ఈ మోడల్, సిటీ డ్రైవ్‌కు అనుకూలంగా ఉంది. సెగ్మెంట్‌లో అత్యధిక సీటింగ్ సౌకర్యంతో ఉంటుంది. మూడు వేరియంట్లతో, రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 123 కి.మీ రేంజ్ కలిగి ఉంది. 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 160 కి.మీ వరకు ప్రయాణం సాధ్యం. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.04 లక్షల నుంచి రూ. 1.42 లక్షల వరకు.
Details
అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్
లాంగ్ రేంజ్ ఈ-స్కూటర్‌గా పేరు పొందింది. 3 బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి: 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 162 కి.మీ రేంజ్ 5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 220 కి.మీ రేంజ్ 6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 261 కి.మీ రేంజ్ ఈ మోడల్స్ ధరలు వరుసగా రూ. 1.20 లక్షలు, రూ. 1.70 లక్షలు, రూ. 2 లక్షలు. ఈ స్కూటర్లు రేంజ్ ఎక్కువగా ఉండటమే కాకుండా, సిటీ డ్రైవ్ కోసం అత్యంత ఉపయోగకరమైనవి కావడంతో, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మీ అడుగులు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.