LOADING...
Andhra pradesh: మెట్రో నగరాల్లో సురక్షిత డ్రైవింగ్ కోసం.. డ్రైవింగ్ డేటాసెట్
మెట్రో నగరాల్లో సురక్షిత డ్రైవింగ్ కోసం.. డ్రైవింగ్ డేటాసెట్

Andhra pradesh: మెట్రో నగరాల్లో సురక్షిత డ్రైవింగ్ కోసం.. డ్రైవింగ్ డేటాసెట్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెట్రో నగరాల్లో రోడ్లపై గుంతల వల్ల వాహనాలు ప్రమాదానికి గురయ్యే సమస్యను తగ్గించడానికి, హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ ఐటీ ప్రొఫెసర్ సీవీ జవహర్ మొట్టమొదటి భారతీయ డ్రైవింగ్ డేటాసెట్ (IDDD)ను రూపొందించారు. ఈ డేటాసెట్‌లో ఒక్కో కారుకు ఆరు కెమెరాలు,లైడార్ అమర్చారు. వీటితో నగరాల రహదారుల రద్దీ, గుంతల పరిస్థితులను చిత్రాల (ఇమేజ్) రూపంలో సేకరించి, సర్వర్‌లో పొందుపరిచారు. వాహనాల్లో ఈ IDDDని అమర్చితే, ఆయా నగరాల్లో సాఫీగా,భద్రంగా ప్రయాణం చేయొచ్చని జవహర్‌ మంగళవారం తెలిపారు.

వివరాలు 

25 నగరాల రహదారులపై ప్రయాణిస్తూ డేటా సేకరణ 

రోడ్లపై వాహనం నడుస్తున్నప్పుడు గుంతలపై హెచ్చరికలు జారీ అవుతాయి, తద్వారా ప్రమాదాలు తగ్గుతాయి. ఈ డేటాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని 25 నగరాల రహదారులపై ప్రయాణిస్తూ సేకరించారన్నారు. అంతేకాక, ప్రముఖ వాహన కంపెనీలు, వేల మంది వినియోగదారులు తమతో డేటా మార్పిడి చేసుకున్నారని జవహర్‌ తెలిపారు.