EV : మొదటి ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు విడుదలైందో తెలుసా..?నేడు ఈవి మార్కెట్ విలువ రూ.33 వేల కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల చరిత్ర ఎంతో పాతది?ఈ రోజు ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే అవుననే సమాధానం వస్తుంది.
ఇది దాదాపు 10 లేదా 15 సంవత్సరాల క్రితంది అంటారు. మీరు కూడా ఇలానే సమాధానం ఇస్తే మీరు పప్పులో కాలువేసినట్లే.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 1832లో స్కాట్‌లాండ్‌లో తయారైందని,సరిగ్గా 59ఏళ్ల తర్వాత అంటే 1891లో అమెరికా రోడ్డుపై తొలి ఎలక్ట్రిక్ కారు నడిచిందని మీకు తెలుసా!
వాస్తవానికి, మునుపటి కాలంలో,ఎలక్ట్రిక్ కార్లలో AC,పవర్ స్టీరింగ్,నేటి హైటెక్ ఫీచర్లు లేవు.అయితే ఈ కార్లు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లకు పునాది వేసాయి.
అటువంటి పరిస్థితిలో, 192సంవత్సరాల నాటి ఎలక్ట్రిక్ కారు చరిత్రను విస్మరించలేము.ఈరోజు మనం ఎలక్ట్రిక్ వాహనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Details
ఎలక్ట్రిక్ వాహనం ఎలా స్టార్ట్ అయింది?
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును 1832లో స్కాట్లాండ్‌లో రాబర్ట్ ఆండర్సన్ అనే మెకానిక్ తయారుచేశాడు.
అండర్సన్ సింగిల్ ఛార్జ్ బ్యాటరీని ఉపయోగించారు. దీని తరువాత, 1865లో యాసిడ్ బ్యాటరీని ఉపయోగించి ఫ్రాన్స్‌లో తయారు చేయబడిన రెండవ ఎలక్ట్రిక్ కారుతో ప్రపంచంలో EV తయారీ ప్రక్రియ ప్రారంభమైంది.
ఆ తర్వాత 1891లో ప్రపంచంలోనే మొట్టమొదటి అధికారిక ఎలక్ట్రిక్ కారు అమెరికా రోడ్లపై కనిపించింది.
Details
1993లో భారతదేశ మొదటి EV
1960వ దశకంలో, ప్రపంచంలో ఇంధనం కొరత ఏర్పడింది. ఆ తర్వాత కంపెనీలు EVలపై దృష్టి పెట్టడం ప్రారంభించాయి.
1975లో, అమెరికన్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ డెలివరీ జీపును ప్రవేశపెట్టింది. దీని తరువాత చాలా కంపెనీలు EV విభాగంలో తమ ప్రయత్నాలను ప్రారంభించాయి.
2008లో, టెస్లా రోడ్‌స్టర్ EVని విడుదల చేసింది, ఇది ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ను మార్చింది. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 1993లో విడుదలైంది.
లవ్ బర్డ్ అనేది టూ-సీటర్ ఎలక్ట్రిక్ కారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దీని పరిధి 60 కిలోమీటర్లు.
అయితే, ఈ కారు మార్కెట్లో మనుగడ సాగించలేకపోయింది. తక్కువ సమయంలోనే దానిని నిలిపివేయవలసి వచ్చింది.
Details
EVకి 33 లక్షల కోట్ల ప్రపంచ మార్కెట్
ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ ఈ రోజుల్లో గరిష్ట స్థాయికి చేరుకుంది.
అందుకే టెస్లా అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా తమ ఉత్పతులను తయారు చేస్తున్నారు.
దానికి పోటీగా చైనా కంపెనీలు షియోమీ, బివైడిలు సిద్ధమయ్యాయి.
అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు ఈ మూడు కంపెనీలు భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌గా చూస్తున్నాయి.
Details
గతేడాది భారతదేశంలో 15 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయి
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం మొదట FAME-1 సబ్సిడీని ప్రారంభించింది.
దీనిని ప్రభుత్వం FAME-2 సబ్సిడీ పేరుతో మరింత పొడిగించింది. ఈ సబ్సిడీ పథకం కింద, ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుపై రాయితీ అందుబాటులో ఉంది.
దీని ఫలితంగా గత ఏడాది దేశంలో 15 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయి.
Details
2023లో ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల EVల విక్రయం
ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం గురించి మనం మాట్లాడుకుంటే, గతేడాది ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి.
ఇందులో ద్విచక్ర, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది.