
Honda and Nissan: టెస్లాతో పోటీ పడేందుకు హోండా,నిస్సాన్ త్వరలో విలీనం..!
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్ (Honda Motor), నిస్సాన్ మోటార్ (Nissan Motor) మధ్య త్వరలో విలీనం జరుగనుందని వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఈ మేరకు ఇరు సంస్థలు చర్చలు జరిపినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.
గ్లోబల్ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు ఈ విలీనానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ వార్తల ప్రభావంతో బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో నిస్సాన్ షేర్లు 24 శాతం మేర పెరిగి, ఇంట్రాడేలో కొత్త రికార్డును నమోదు చేశాయి.
వివరాలు
హోండా,నిస్సాన్ సంయుక్తంగా ప్రతి ఏడాదీ 74 లక్షల వాహనాల ఉత్పత్తి
ఇక, ఈ రెండు సంస్థల మధ్య జరిగిన రాత్రి చర్చల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని,హోండా సంస్థ ఈ విలీనం,మూలధన వ్యయం వంటి అనేక అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా తెలిపారు.
అయితే,పూర్తి వివరాలను అందించడానికి ఆయన నిరాకరించారు. ఒకవేళ ఈ విలీనం జరిగితే, హోండా,నిస్సాన్ సంయుక్తంగా ప్రతి ఏడాదీ 74 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అందుకోవచ్చు.
ఈ సంయుక్త సంస్థ టయోటా,వోక్స్‌వ్యాగన్ తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మొబైల్ గ్రూప్‌గా అవతరించే అవకాశముంది.
ఇదిలా ఉండగా, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం ఈ ఏడాది మార్చి నెలలోనే ఇరు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.