Page Loader
Honda Price Hike: హోండా కార్ల ధరలు పెంపు.. కొత్త ఏడాది నుంచి పెరిగిన ధరలు అమల్లోకి.. 
హోండా కార్ల ధరలు పెంపు.. కొత్త ఏడాది నుంచి పెరిగిన ధరలు అమల్లోకి..

Honda Price Hike: హోండా కార్ల ధరలు పెంపు.. కొత్త ఏడాది నుంచి పెరిగిన ధరలు అమల్లోకి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2024
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మక వాహన తయారీ సంస్థ హోండా ఇండియా (Honda India) శుక్రవారం కార్ల ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. కొత్త సంవత్సరం నుండి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది. ఈ ధరల పెంపు అన్ని మోడళ్లపై సుమారు 2 శాతం వరకూ ఉంటుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

వివరాలు 

అమేజ్‌, సిటీ, ఎలివేట్ వంటి పాపులర్ మోడళ్లను విక్రయిస్తున్నహోండా

ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో వాహన ధరల పెంపు తప్పదని, ఈ వ్యయభారాన్ని కొంతమేర వినియోగదారులకు బదిలీ చేయాలని హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ల్ చెప్పారు. హోండా కంపెనీ ప్రస్తుతం దేశంలో అమేజ్‌, సిటీ, ఎలివేట్ వంటి పాపులర్ మోడళ్లను విక్రయిస్తోంది. అలాగే, వచ్చే ఏడాది నుండి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే ఇతర ప్రముఖ సంస్థలు ప్రకటించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, మహీంద్రా, ఎంజీఈ మోటార్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు 2025 జనవరి నుండి ధరల పెంపు అమలు చేస్తాయని ప్రకటించాయి. ఇప్పుడు, హోండా కూడా ఈ జాబితాలో చేరింది.