
Gogoro Crossover EV : ఇండియాలోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా ఆటో మొబైల్ మార్కెట్‌లోకి మరో అంతర్జాతీయ సంస్థ త్వరలో రానుంది.
తైవాన్ కు చెందిన గొగొరో సంస్థ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయనుంది. గొగొరో క్రాస్ ఓవర్ ఈవీని డిసెంబర్‌లోనే లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ గొగొరో క్రాస్ ఓవర్ ఈవీ మేన్యూఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మొదలైంది.
బీ2బీ పార్టనర్ట్స్ కి ఈ వెహికల్స్ ను ఆ సంస్థ పంపిణీ చేయనుంది. 2024 మొదట్లో ఈ ఈవీ డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే ఈ గొగొరో క్రాస్ ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టూ వీలర్ 'ఎస్‌యూవీ'గా గుర్తింపు లభించింది.
అడాప్టెబులిటీ, యుటిలిటీని దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్ ను రూపొందించారు.
Details
మహారాష్ట్రలో 1.5 కోట్ల పెట్టుబడులకు గొగొరే ప్రణాళికలు
గొగొరో క్రాస్ ఓవర్ ఈవీలో 1.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇదే కనుక నిజమైతే ఈ మోడల్ రేంజ్ దాదాపు 100 కి.మీలుగా ఉంటుంది.
ఇండియాలో వేగంగా వృద్ధి చెందడానికి ఆ సంస్థ మహారాష్ట్రలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇక స్విగ్గీ, జొమాటోతో పార్టనర్ షిప్‌ని ఏర్పాటు చేసుకుంది.
గొగొరో క్రాస్ ఓవర్ ఈవీ సంబంధించి ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలపై ఆ సంస్థ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
లాంచ్ సమయంలో వీటి గురించి తెలిసే అవకాశం ఉంటుంది.