Mahindra XUV400 : మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ మోడల్‌పై భారీగా తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వినియోగదారులకు శుభవార్తను వెల్లడించింది.
ఈ సంస్థ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలో అనేక మోడళ్లను కలిగి ఉంది.
అయితే, వీటిలో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన XUV400కు ఉన్న డిమాండ్ భిన్నంగా ఉంటుంది.
ఈ కారును కొనాలనుకునే వారికి మహీంద్రా తాజాగా గొప్ప ఆఫర్ ప్రకటించింది.
ఈ నెలలో XUV400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై రూ.4 లక్షల వరకు భారీ తగ్గింపు అందిస్తోంది.
2024 మోడళ్ల స్టాక్ ఇంకా అందుబాటులో ఉండటంతో వాటి అమ్మకాలను పెంచేందుకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది.
ఈ మోడల్ EC మరియు EL వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే, ప్రస్తుతం ఈ తగ్గింపు EL ప్రో వేరియంట్లకు మాత్రమే వర్తించనుంది.
వివరాలు
మహీంద్రా XUV400 ఫీచర్లు
XUV400 EL (2024) మోడల్‌పై గరిష్టంగా రూ. 4 లక్షల వరకు తగ్గింపు లభించగా, XUV400 EL (2025) మోడల్ రూ. 2.50 లక్షల తగ్గింపుతో లభించనుంది.
ఈ కార్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 15.49 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో టైర్ ప్రెజర్ అలర్ట్, డోర్ ఓపెనింగ్ అలర్ట్, ఓవర్ స్పీడ్ అలర్ట్, జియో ఫెన్స్ అలర్ట్, హై టెంపరేచర్ అలర్ట్, ఛార్జర్ ట్రబుల్ అలర్ట్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, వాలెట్ మోడ్, షేర్ మై లోకేషన్ వంటి సాంకేతిక సదుపాయాలు అందించబడుతున్నాయి.
వివరాలు
భద్రత పరంగా XUV400 Pro అధిక ప్రాముఖ్యత
ఇందులో 6 ఎయిర్ బ్యాగ్‌లు, ESP, DBMS, ఆటో డిమ్మింగ్ ఫీచర్‌తో IRVM, 4 వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఐసోఫిక్స్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా XUV400 EL Pro వేరియంట్ 34.5 kWh బ్యాటరీ ప్యాక్, 7.2 kW AC ఛార్జర్‌తో లభిస్తుండగా, మరొక మోడల్ 39.4 kWh AC ఛార్జర్‌తో వస్తుంది.
అదే సమయంలో, ఎంట్రీ లెవల్ EC ప్రో మోడల్ 34.5 kWh బ్యాటరీ ప్యాక్, 3.3 kW AC ఛార్జింగ్ ఆప్షన్ కలిగి ఉంటుంది.