LOADING...
Citroen C3X: ఎంఎస్‌ ధోనీ నటించిన సిట్రోయెన్‌ C3X టీజర్‌ రిలీజ్‌.. లాంచ్‌కు ముందు హైలైట్‌లు

Citroen C3X: ఎంఎస్‌ ధోనీ నటించిన సిట్రోయెన్‌ C3X టీజర్‌ రిలీజ్‌.. లాంచ్‌కు ముందు హైలైట్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌కు చెందిన ఆటో మొబైల్‌ బ్రాండ్‌ సిట్రోయెన్‌ ఇండియా, తన కొత్త బాసాల్ట్‌ కూపే SUV వెర్షన్‌ను 'C3X' పేరుతో తీసుకురానుంది. ఈ మోడల్‌కు సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేస్తూ, తమ బ్రాండ్‌ అంబాసడర్‌ ఎంఎస్‌ ధోనిని ఫీచర్‌ చేసింది. ఇప్పటివరకు 'వాల్యూ-ఫస్ట్‌' (Value-First) స్ట్రాటజీతో ముందుకు వచ్చిన సిట్రోయెన్‌,ఈసారి 'ఫీచర్‌-ఫస్ట్‌' (Feature-Led) దిశగా అడుగులు వేస్తోందని ఈ వీడియో సూచిస్తోంది. టీజర్‌లో అన్ని వివరాలు బయటపెట్టకపోయినా, కొన్ని కీలక హైలైట్‌లు మాత్రం కనిపిస్తున్నాయి. టీజర్‌ ప్రకారం,ఈ కొత్త మోడల్‌ డిజైన్‌లో బాసాల్ట్‌తో పోలిస్తే కొన్ని మార్పులు ఉన్నాయి. అయితే, బాసాల్ట్‌ కూపే SUVలో కనిపించే సిల్హౌట్‌(Silhouette)ఇక్కడ కూడా కొనసాగింది. అలాగే,ఎరుపు-నలుపు కలర్‌ కాంబినేషన్‌ను ఈ కొత్త వెర్షన్‌లో కూడా ఉపయోగించారు.

వివరాలు 

 ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 

ముఖ్యంగా, అప్‌గ్రేడ్‌ చేసిన LED DRLs‌ను మరింత కట్టిపడేసే డిజైన్‌తో అందించారు. వెనుక భాగంలో కూడా ఇలాగే ఆకర్షణీయమైన మార్పులు చేశారు. అదనంగా, కొత్తగా మరింత స్పష్టంగా కనిపించే బ్యాడ్జ్‌ను ఉంచారు. సిట్రోయెన్‌ C3X, ప్రస్తుతం భారత మార్కెట్‌లోని ఇతర సిట్రోయెన్‌ మోడళ్లలాగే కామన్‌ మాడ్యూలర్‌ ప్లాట్‌ఫామ్‌ (CMP) మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే, ఈసారి మరింత మెరుగైన ఫిట్‌ & ఫినిష్‌ను అందిస్తారని అంచనాలు ఉన్నాయి. టెక్నికల్‌ స్పెసిఫికేషన్లు ఇంకా ప్రకటించనప్పటికీ, బాసాల్ట్‌లో ఉన్న 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌.. నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ (82 bhp) టర్బోచార్జ్డ్‌ (110 bhp) వెర్షన్లలో.. కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

వివరాలు 

 R&D,లోకలైజేషన్‌, తయారీకి రూ.5,300 కోట్లు 

ఇక, సిట్రోయెన్‌ ఇండియా తాజాగా "Citroen 2.0 - Shift Into the New" అనే కొత్త వ్యూహాత్మక ప్రణాళికను ప్రకటించింది. దీని ద్వారా ఉత్పత్తుల ఆకర్షణ పెంచడం, మార్కెట్‌లో విస్తరించడం, స్థానిక అనుబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు, ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌ (ICE), ఎలక్ట్రిక్‌ ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టుబడులు పెంచుతూ, ఇప్పటికే R&D, లోకలైజేషన్‌, తయారీకి కేటాయించిన రూ.5,300 కోట్లకు అదనంగా ఇన్వెస్ట్‌ చేస్తోంది.