Page Loader
OLA Electric Bike:కొత్త ఈవీ బైక్‭ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన ఓలా.. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసిన సీఈఓ
కొత్త ఈవీ బైక్‭ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన ఓలా..

OLA Electric Bike:కొత్త ఈవీ బైక్‭ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన ఓలా.. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసిన సీఈఓ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న ఓలా ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వినూత్నమైన మోడళ్లతో వినియోగదారులను ఆకర్షిస్తూ భారీ అమ్మకాలను సాధిస్తున్న ఈ కంపెనీ త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆటో మొబైల్ ప్రియులు, ఓలా అభిమానులు- ఈ బైక్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? దీని డిజైన్, ఫీచర్లు ఎలా ఉంటాయి? అనే ఉత్కంఠతో సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆసక్తిని మరింత పెంచుతూ, ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఈ బైక్ ఫస్ట్ లుక్ ఫోటోలను విడుదల చేసింది.

వివరాలు 

బైక్‌పై కనిపించని కంపెనీ లోగో  

తాజాగా, ఓలా ఎలక్ట్రిక్ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో ఈ బైక్ ఫోటోలను షేర్ చేశారు. ఈ చిత్రాల్లో పసుపు (Yellow) రంగులో ఆకర్షణీయమైన డిజైన్‌తో బైక్ కనిపిస్తోంది. ప్రత్యేకంగా, హ్యాండిల్ బార్స్ క్రింద విల్లు ఆకారంలో (arrow-shaped) ప్యానెల్స్ ఉండటం విశేషం, ఇది బైక్‌కు డైనమిక్ లుక్‌ను అందిస్తోంది. అయితే, బైక్‌పై ఓలా ఎలక్ట్రిక్ లోగో కనిపించకపోవడం గమనార్హం. దీని వల్ల బైక్ డిజైన్ ఇంకా పూర్తికాలేదని అర్థం అవుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భవీష్ అగర్వాల్ చేసిన ట్వీట్ 

వివరాలు 

అధికారిక లాంచ్ తేదీని ప్రకటించని కంపెనీ 

ఓలా ఎలక్ట్రిక్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉండగా, తయారీ కేంద్రం తమిళనాడులోని హూసూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడే ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు అదే ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ బైక్ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు ఓలా సన్నాహాలు చేసుకుంది. స్కూటర్ విభాగంలో విజయవంతమైన ఓలా, ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో కూడా తనదైన ప్రభావాన్ని చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బైక్ ఫోటోలు విడుదల చేసినప్పటికీ, అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ బైక్ 2025 రెండో భాగంలో విడుదలయ్యే అవకాశముంది.