Tata Harrier EV 4x4: భారత మార్కెట్లోకి టాటా హారియర్ ఈవీ 4x4.. ఎప్పుడంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్‌కు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఆ సంస్థ నుంచి వచ్చిన మోడల్స్ సక్సెస్ అయ్యాయి. అయితే టాటా హారియర్ 4x4(Tata Harrier EV 4x4) లాంచ్ పై కస్టమర్లు అతృతుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా టాటా హారియర్ గురించి ఆ సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. 2024 చివరి నాటికి ఇండియాలో టాటా హారియర్ ఈవీ 4x4ను లాంచ్ చేస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది. దీని ధర దాదాపు రూ. 26 లక్షల నుండి ప్రారంభం కానుంది. ఆల్-ఎలక్ట్రిక్ హారియర్ ఇటీవల ప్రారంభించిన హారియర్ ఫేస్‌లిఫ్ట్‌ను పోలి ఉండే అవకాశం ఉంది,
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు
ఇందులో ఎక్ట్సీరియర్‌లో సీల్డ్ ఫ్రంట్ గ్రిల్, ఇల్యూమినేటెడ్ టాటా లోగో, LED హెడ్‌లైట్లు, స్లిమ్ LED DRLలు, ఎయిర్ ఇన్‌లెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా హారియర్ EV 60kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌పై 500కిమీ కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది. హారియర్ ఈవీలో ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వైర్‌లెస్ Apple CarPlayతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ ఉన్నాయి.