
Tesla: భారతదేశపు మొట్టమొదటి సూపర్‌చార్జర్ స్టేషన్‌ను ప్రారంభించిన టెస్లా.. పూర్తి వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా, తాజాగా భారత్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ముంబయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించిన రోజునే, టెస్లా మోడల్ Y కారును కూడా భారత్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు,టెస్లా ముంబయిలో భారత్‌లో తొలి సూపర్‌చార్జర్ స్టేషన్‌ను కూడా ప్రారంభించింది. సమాచారం ప్రకారం,ముంబైలోని ఈ టెస్లా చార్జింగ్ స్టేషన్‌లో మొత్తం ఎనిమిది చార్జింగ్ స్టాల్స్ ఉంటాయి. ఇందులో నాలుగు V4 సూపర్‌చార్జింగ్ స్టాల్స్ (అంటే DC ఫాస్ట్ చార్జర్స్),మరో నాలుగు డెస్టినేషన్ చార్జింగ్ స్టాల్స్ (AC చార్జర్స్)గా ఉన్నాయి. ఇందులో DC సూపర్‌చార్జర్లు గంటకు గరిష్ఠంగా 250 కిలోవాట్ల వేగంతో ఛార్జ్ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి.
వివరాలు
సూపర్‌చార్జర్ ద్వారా 250 కిలోవాట్ల వేగంతో ఛార్జ్ చేస్తే,ఒక్క ఛార్జ్‌కి సుమారుగా ₹1,500 ఖర్చు
దీని కోసం టెస్లా యూజర్లు ఒక్క కిలోవాట్‌కు ₹24చెల్లించాలి.ఇక 11కిలోవాట్ల ఛార్జింగ్ స్పీడ్ కోసం ధర ₹11/కిలోవాట్‌గా నిర్ణయించారు. టెస్లా యూజర్లు ఈ సూపర్‌చార్జర్ స్టేషన్‌ను ఉపయోగించాలంటే,ముందుగా టెస్లా యాప్‌లో అందుబాటులో ఉందో లేదో చెక్ చేయాలి. అదేయాప్‌లో బ్యాటరీ స్థాయి,ఛార్జింగ్ ప్రోగ్రెస్,స్టేటస్ వంటి వివరాలన్నీ కూడా తెలుస్తాయి. ఇక మోడల్ Y గురించి చెప్పాలంటే,దీన్ని సూపర్‌చార్జర్ ద్వారా 250 కిలోవాట్ల వేగంతో ఛార్జ్ చేస్తే,ఒక్క ఛార్జ్‌కి సుమారుగా ₹1,500 ఖర్చవుతుంది. ఈ ఛార్జ్‌తో కేవలం 15 నిమిషాల్లో 267 కిలోమీటర్ల వరకూ రేంజ్ పొందవచ్చు. కంపెనీ ప్రకారం ఇది ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు ఐదు రౌండ్ ట్రిప్స్‌కు సరిపోతుందని చెబుతోంది.
వివరాలు
రెండు వేరియంట్లలో టెస్లా మోడల్ Y
మరోవైపు, టెస్లా మోడల్ Yలో రెండు వేరియంట్లు లభిస్తున్నాయి. RWD,RWD లాంగ్ రేంజ్. ఇందులో 60 kWh, 75 kWh బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. RWD వేరియంట్‌లో ఒక్కటి ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది,ఇది దాదాపు 295 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 60 kWh బ్యాటరీ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌కి WLTP రేంజ్ 500 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక లాంగ్ రేంజ్ వేరియంట్ 622 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. RWD మోడల్ ధర ₹59.89 లక్షల నుంచి మొదలవుతుంది, లాంగ్ రేంజ్ వేరియంట్ ధర ₹67.89 లక్షలు.