NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Tesla: డ్రైవర్‌లెస్ రోబోవాన్‌ను పరిచయం చేసిన టెస్లా.. దాని ప్రత్యేకత ఏంటంటే..?
    తదుపరి వార్తా కథనం
    Tesla: డ్రైవర్‌లెస్ రోబోవాన్‌ను పరిచయం చేసిన టెస్లా.. దాని ప్రత్యేకత ఏంటంటే..?
    డ్రైవర్‌లెస్ రోబోవాన్‌ను పరిచయం చేసిన టెస్లా

    Tesla: డ్రైవర్‌లెస్ రోబోవాన్‌ను పరిచయం చేసిన టెస్లా.. దాని ప్రత్యేకత ఏంటంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 11, 2024
    10:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టెస్లా సీఈవీ ఎలాన్ మస్క్ తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారు. ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్‌ను 'వీరోబో' కార్యక్రమంలో హఠాత్తుగా ప్రదర్శించారు.

    ఈ కార్యక్రమం కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో నిర్వహించబడింది.

    రోబో వ్యాన్ సాధారణ డిజైన్లకు పూర్తి భిన్నంగా ఉంది; ఇది రైలు ఇంజిన్ వంటి డిజైన్‌లో తయారుచేయబడింది.

    దీని చక్రాలు బయటకు కనిపించకపోవడం ప్రత్యేకత. దీన్ని 20 మంది ప్రయాణికులను లేదా సరకులను తరలించడానికి ఉపయోగించవచ్చని సంస్థ పేర్కొంది.

    ఈ వ్యాన్ మైలు దూరం ప్రయాణించడానికి 5 నుండి 10 సెంట్ల వరకు ఖర్చవుతుందని టెస్లా బృందం తెలిపింది.

    దీనిని అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం నిర్మించినట్లు తెలుస్తోంది.తద్వారా టెస్లా మాస్ ట్రావెల్ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించినట్లైంది.

    వివరాలు 

    10 రెట్లు అదనంగా వాడుకునే సైబర్ ట్యాక్సీ

    ఇప్పటివరకు సంస్థ వాహనాల లైనప్ కేవలం చిన్న వాహనాలకు మాత్రమే పరిమితమైంది.

    మస్క్ రోబో ట్యాక్సీని కూడా ఆవిష్కరించారు. రెండు డోర్లతో ఉన్న ఈ కారుకు స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ లేవు.

    దీనిని మస్క్ సైబర్ క్యాబ్ అని ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీని తయారీ 2026 నుండి మొదలవుతుందని వెల్లడించారు.

    వినియోగదారులు దీనిని 30,000 డాలర్ల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ప్రతీ మైలు ప్రయాణానికి 20 సెంట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు.

    అటానమస్ కార్లను సాధారణ వాహనాల కంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువగా వాడుకోవచ్చు అని మస్క్ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెస్లా
    ఎలాన్ మస్క్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    టెస్లా

    Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం భారతదేశం
    రూ.6వేల కోట్ల జీతాలను వాపస్ చేయనున్న టెస్లా డైరెక్టర్లు ఎలాన్ మస్క్
    టెస్లా చరిత్రలోనే అత్యంత చౌకైన ఈవీ వెహికల్.. ఇండియాలోనే మాన్యూఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ!  ఆటో మొబైల్
    కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో టెస్లా ఉన్నతాధికారుల కీలక చర్చలు బిజినెస్

    ఎలాన్ మస్క్

    Space X: లైంగిక వేధింపుల ఆరోపణతో ఎలాన్ మస్క్‌పై దావా వేసిన మాజీ స్పేస్-ఎక్స్ ఉద్యోగులు  టెక్నాలజీ
    Elon Musk: ఎలాన్ మస్క్ జీతం $56 బిలియన్లకు ఆమోదం  టెస్లా
    Tesla: ఎలాన్ మస్క్‌పై టెస్లా పెట్టుబడిదారులు దావా  టెస్లా
    Tesla: మస్క్ $56B పే ప్యాకేజీని పునరుద్ధరించడానికి న్యాయ పోరాటాన్ని ప్రారంభించించిన టెస్లా  టెస్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025