
Car Sales Record: ఇండియాలో తయారైన ఈ ఆరు కార్లు.. భారీ విక్రయాలతో విదేశాలలో రికార్డ్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద కార్ల మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది.
అనేక అంతర్జాతీయ ఆటో మొబైల్ బ్రాండ్‌లు తమ వాహనాల ఉత్పత్తి కేంద్రాలుగా భారత్‌ను ఎంచుకుంటున్నాయి.
ఇందులో ఆశ్చర్యకరంగా, కొన్ని మోడళ్ల కార్లు దేశంలో కన్నా విదేశాల్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
ప్రస్తుతం భారతదేశంలో తయారవుతున్న హోండా సిటీ, ఎలివేట్, నిస్సాన్ సన్నీ, మాగ్నైట్, హ్యుందాయ్ వెర్నా, జీప్ మెరిడియన్ వంటి ఆరు మోడళ్ల కార్లు అంతర్జాతీయ మార్కెట్లలో పెద్ద ఎత్తున డిమాండ్‌ను సాధిస్తున్నాయి.
ప్రారంభంలో ఇవి భారత వినియోగదారుల కోసం రూపొందించబడ్డా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణతో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు నమోదవుతున్నాయి.
వివరాలు
సెప్టెంబర్ 2023లో హోండా SUV సెగ్మెంట్
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (SIAM) వెల్లడించిన 2025 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం,ఈ ఎగుమతి ధోరణి ప్రధానంగా దేశీయ డిమాండ్ తగ్గుదలతో పాటు, అంతర్జాతీయ అవసరాలకు తగిన ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఇండియన్ ప్లాంట్ల ప్రభావంతో ఏర్పడింది.
ఈ నేపథ్యంలో హోండా ఎలివేట్ ఒక ముఖ్యమైన ఉదాహరణ. భారతదేశంలో SUV సెగ్మెంట్‌లో ఆదరణ పొందేలా సెప్టెంబర్ 2023లో హోండా ఈ మోడల్‌ను ప్రారంభించింది.
ప్రారంభంలో వృద్ధి కనిపించినా, క్రమంగా దేశీయ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.
అందుకే హోండా ఈ కారును జపాన్ వంటి మార్కెట్లలో ప్రవేశపెట్టింది. అక్కడ ఇది WR-V పేరుతో విక్రయమవుతోంది.
వివరాలు
విదేశాలకు 45,167 యూనిట్లు ఎగుమతి
2025 ఆర్థిక సంవత్సరంలో హోండా భారత్‌లో ఎలివేట్ మోడల్‌కి 22,321 యూనిట్ల దేశీయ అమ్మకాలు నమోదయ్యాయి.
అదే సమయంలో,విదేశాలకు 45,167 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.
గత ఏడాది 33,642 యూనిట్లు దేశంలో అమ్ముడవగా, కేవలం 10,273 యూనిట్లు మాత్రమే ఎగుమతి చేశారు.
ఈ సంవత్సరం మొత్తం ఉత్పత్తి 54 శాతం పెరిగి 67,488 యూనిట్లకు చేరింది.సరఫరా స్థాయిని నిలబెట్టేందుకు ఎగుమతులు కీలక పాత్ర పోషించాయి.
హ్యుందాయ్ వెర్నా పరిస్థితీ అంతే. 2023లో దీన్ని రీ-లాంచ్ చేసినప్పటికీ, భారత మార్కెట్‌లో SUVల పెరుగుతున్న డిమాండ్ కారణంగా సెడాన్ తరహా వాహనాలపై ఆసక్తి తగ్గిపోయింది.
వివరాలు
కార్ ఎగుమతులు 50,000 యూనిట్లకు పైగా..
అందుకే హ్యుందాయ్ తన గ్లోబల్ ఎగుమతి నెట్‌వర్క్‌ను ఉపయోగించి వెర్నాను మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల్లో విక్రయించడం ప్రారంభించింది.
ఈ క్రమంలో FY25లో ఈ కార్ ఎగుమతులు 50,000 యూనిట్లకు పైగా నమోదయ్యాయి.
అదే విధంగా, నిస్సాన్ మాగ్నైట్ మోడల్ 2020లో భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదలైంది.
ఇది మిడ్-రేంజ్ SUVగా రాబడినప్పటికీ, విదేశీ మార్కెట్లలోనూ మంచి ఆదరణ పొందింది. FY24లో దేశీయంగా 30,146 యూనిట్లు విక్రయమవగా, 9,314 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.
FY25 నాటికి మొత్తం ఉత్పత్తి 57,036 యూనిట్లకు చేరగా, వాటిలో 29,155 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.
ఇక దేశీయ అమ్మకాలు 27,881 యూనిట్లకు తగ్గిపోయాయి. అంటే ఎగుమతులు స్థానిక అమ్మకాలతో సమానంగా నిలిచాయి.