LOADING...
Renault Duster: టైగన్, కుషాక్, క్రెటా N లైన్ కంటే డస్టర్ ఎందుకు బెస్ట్?
టైగన్, కుషాక్, క్రెటా N లైన్ కంటే డస్టర్ ఎందుకు బెస్ట్?

Renault Duster: టైగన్, కుషాక్, క్రెటా N లైన్ కంటే డస్టర్ ఎందుకు బెస్ట్?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో ఇప్పటివరకు హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం కొనసాగుతుండగా, డ్రైవింగ్‌ ఇష్టపడే వారికి వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మంచి ఎంపికలుగా నిలిచాయి. అయితే ఇప్పుడు రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీతో ఈ సెగ్మెంట్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారింది. 2026 డస్టర్ రాకతో టైగన్, కుషాక్ ఆధిపత్యానికి సవాల్ ఎదురవుతోంది. మరి కొత్త డస్టర్ ఎందుకు కొనాలి? ముఖ్యమైన కారణాలు ఇవే.

వివరాలు 

2026 Renault Duster: సెగ్మెంట్‌లో బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్

డస్టర్ అంటే డ్రైవింగ్‌లో థ్రిల్ ఇస్తుందనే పేరు ఉంది. కొత్త 2026 మోడల్ ఈ విషయంలో మరింత మెరుగైంది. ముందుభాగంలో భారీ యాంటీ-రోల్ బార్, వెనుక అదనపు యాంటీ-రోల్ బార్ ఉండటంతో బాడీ రోల్ గణనీయంగా తగ్గింది. చెన్నైలోని MMRT రేస్ ట్రాక్‌పై సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్‌లను ప్రత్యేకంగా ట్యూన్ చేయడంతో, ఈ S UV చాలా స్టేబుల్‌గా, కంట్రోల్‌లో ఉండేలా తయారైంది. దాని సైజ్‌కు తగ్గట్టు ఆశ్చర్యకరంగా అజైల్‌గా కూడా ఉంటుంది. మొత్తంగా డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బ్యాలెన్స్‌గా అనిపిస్తుంది.

వివరాలు 

2026 Renault Duster: క్లాస్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ SUV

పర్ఫార్మెన్స్ విషయంలో కూడా డస్టర్ దూసుకుపోతుంది. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ 4 సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 163 హార్స్‌పవర్, 268 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత శక్తివంతమైన SUVగా నిలుస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా DCT వెట్ క్లచ్ యూనిట్ కావడం వల్ల స్మూత్ షిఫ్టింగ్, మంచి హీట్ మేనేజ్‌మెంట్ లభిస్తుంది. ఈ కారణంగా టైగన్, కుషాక్, క్రెటా N లైన్ కంటే డస్టర్ పనితీరు ముందుంటుంది.

Advertisement

వివరాలు 

2026 Renault Duster: గూగుల్ సపోర్ట్‌తో స్మార్ట్ SUV

ఇప్పటి కాలంలో కేవలం డ్రైవింగ్ కాకుండా టెక్నాలజీ కూడా కీలకం. ఈ విషయంలో రెనాల్ట్ పెద్ద అప్‌గ్రేడ్ ఇచ్చింది. కొత్త డస్టర్‌లో గూగుల్ ఇంటిగ్రేషన్ అందించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్, కనెక్టెడ్ సర్వీసులు, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్అన్ని సిస్టమ్‌లోనే ఉంటాయి. ఇది నగరాల్లో, తెలియని మార్గాల్లో డ్రైవింగ్ చేయడాన్ని చాలా సులభం చేస్తుంది.

Advertisement

వివరాలు 

2026 Renault Duster: ఎందుకు కొనాలి?

వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, హ్యుందాయ్ క్రెటా N లైన్ ఇప్పటికే మంచి డ్రైవర్ ఫోకస్‌డ్ SUVలుగా పేరుగాంచాయి. కానీ కొత్త డస్టర్ పనితీరు, డ్రైవింగ్ డైనమిక్స్, టెక్నాలజీ అన్ని అంశాల్లో కొత్త స్టాండర్డ్‌ను సెట్ చేసింది. మెరుగైన హ్యాండ్లింగ్, సెగ్మెంట్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ ఇంజిన్, గూగుల్ ఆధారిత ఫీచర్లతో డస్టర్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.

Advertisement