Sebi chairperson Madhabi Puri Buch: హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన సెబీ చీఫ్
అమెరికాకు చెందిన రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం (ఆగస్టు 10) మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌లపై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో ముడిపడి ఉన్న ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధవి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. హిండెన్‌బర్గ్ తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సెబీ చీఫ్ కొట్టిపారేశారు. అదానీ గ్రూప్ కూడా బచ్‌తో తమకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టం చేసింది. బెర్ముడా, మారిషస్‌లలోని అదానీ డొల్ల కంపెనీల్లో వారిద్దరూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని కూడా పేర్కొంది
మారిషస్ ఫండ్‌లో పెట్టుబడి నిర్ధారణ
హిండెన్‌బర్గ్ ప్రతిస్పందన కూడా బుచ్ ప్రతిస్పందన అతను బెర్ముడా/మారిషస్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టినట్లు స్పష్టం చేసింది. వినోద్ అదానీ (గౌతమ్ అదానీ పెద్ద సోదరుడు) ఎగ్గొట్టిన డబ్బును కూడా ధృవీకరించింది. అదానీ డొల్ల కంపెనీల నిధులనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ అడ్డదారిన భారత్‌కు తరలించి అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. హిండెన్‌బర్గ్ మార్కెట్ నియంత్రణ సంస్థ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడంతో దేశవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. దీంతో బచ్ దంపతులు ప్రకటనను విడుదల చేశారు.హిండెన్‌బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలన్నీ ''నిరాధారమైనవి, ఊహాగానాలు'' అంటూ తీవ్రంగా ఖండించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు.
ఆర్థిక వివరాలన్నింటినీ ఏ ప్రభుత్వ సంస్థ కోరినా ఇస్తాం: బచ్ దంపతులు
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ...''మా జీవితం,పెట్టుబడులు అన్ని తెరిచిన పుస్తకం.హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంతకముందు చేసిన ఏ ఆరోపణలపైన అయితే సెబీ చట్టపరమైన చర్యలు చేపట్టి,షోకాజ్ నోటీసులు జారీ చేసిందో, అదే సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం'అని బచ్ దంపతులు పేర్కొన్నారు. వారి ఆర్థికపరమైన డాక్యుమెంట్లన్నింటీనీ నిస్సంకోచంగా బయటపెట్టేందుకు సిద్ధమని,అలాగే ప్రైవేటు పౌరులుగా ఉన్నప్పటి కాలానికి సంబంధించిన ఆర్థిక వివరాలన్నింటినీ ఏ ప్రభుత్వ సంస్థ కోరినా ఇస్తామని వారు చెప్పారు. అదానీల అక్రమాల్లో సెబీ చీఫ్‌కు సంబంధాలు ఉండడం వల్లే తాము బయటపెట్టిన అవకతవకలపై విచారణ చేపట్టేందుకు సెబీ నిరాకరిస్తోందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. మరోపక్క,అదానీ గ్రూప్‌పై తాము సక్రమంగా దర్యాప్తు చేశామని సెబీ తెలిపింది.