
Air India, Air India Express: సాయుధ దళాలకు ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తోడ్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విధుల కోసం సెలవులను రద్దు చేసుకుని తిరిగి డ్యూటీలో చేరుతున్న భారత సాయుధ దళాల సిబ్బందికి సహాయం చేయడానికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి.
ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ఆర్మీ సిబ్బంది వాటిని రద్దు చేసుకున్నట్లయితే వారికి పూర్తి రీఫండ్ లేదా ఉచితంగా మళ్లీ షెడ్యూల్ చేసుకునే అవకాశాన్ని ఈ సంస్థలు కల్పిస్తున్నట్లు ప్రకటించాయి.
ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' అనే పేరుతో ప్రతీకార చర్యలు చేపట్టింది.
బుధవారం ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మిస్సైల్ దాడులు జరిపాయి.
వివరాలు
పారామిలటరీ బలగాల సెలవులు రద్దు
ఈ మెరుపుదాడుల్లో సుమారు 30 మంది పాక్ ఉగ్రవాదులు మృతి చెందారు. మరో 60 మంది గాయపడ్డట్లు సమాచారం.
ఈ ఆపరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పారామిలటరీ బలగాల సెలవులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే సెలవులో ఉన్న సిబ్బందిని తక్షణమే విధుల్లో చేరేలా చూడాలని సూచించారు.
సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ వంటి అన్ని పారామిలిటరీ దళాలు ఈ ఆదేశాల ప్రకారం విధుల్లో చేరేందుకు చర్యలు చేపట్టాయి.
ఈ నేపథ్యంలో ఆర్మీ సిబ్బందికి వారు బుక్ చేసుకున్న విమాన టికెట్లను అదనపు ఛార్జీలు లేకుండా రద్దు చేసుకునేందుకు, లేదా ఉచితంగా మరో తేదీకి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
వివరాలు
జూన్ 30 వరకు సిబ్బంది డ్యూటీ కట్టుబాట్ల కోసం రీషెడ్యూల్
ఈ నేపథ్యంలో ఎయిరిండియా తమ అధికారిక ప్రకటనలో, "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డిఫెన్స్ కోటా కింద 2025 మే 31 లోపు బుకింగ్ చేసుకున్న టికెట్లను 2025 జూన్ 30 వరకు సిబ్బంది డ్యూటీ కట్టుబాట్ల కోసం రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఈ మేరకు వన్ టైమ్ మినహాయింపు మరియు పూర్తి రీఫండ్ కూడా అందించబడుతుంది" అని తెలిపింది. ఇదే విధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ పోస్ట్‌ను షేర్ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎయిరిండియా చేసిన ట్వీట్
Air India group is grateful for the selfless service and dedication of our military and defence personnel. In the prevailing situation, for those personnel holding defence fares who are booked on Air India and Air India Express flights till 31 May 2025, we are offering full…
— Air India (@airindia) May 7, 2025