LOADING...
Apple: బెంగళూరులో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్‌ ఓపెనింగ్‌కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
బెంగళూరులో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్‌ ఓపెనింగ్‌కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

Apple: బెంగళూరులో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్‌ ఓపెనింగ్‌కి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ (Apple) భారత్‌లో తన కార్యకలాపాల విస్తరణను వేగంగా కొనసాగిస్తోంది. ఐఫోన్‌లతో పాటు ఇతర ఉత్పత్తులకు భారత మార్కెట్‌ ముఖ్య కేంద్రంగా మారిన నేపథ్యంలో, ఇక్కడి తయారీ,విక్రయాలను సంస్థ మరింత బలపరుస్తోంది. ఇప్పటికే దిల్లీ, ముంబై నగరాల్లో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసిన ఆపిల్‌, ఇప్పుడు మూడో స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన తేదీని కూడా సంస్థ ఖరారు చేసింది. తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, వచ్చే నెల సెప్టెంబర్‌ 2న బెంగళూరులో తొలి ఆపిల్ రిటైల్ స్టోర్‌ ప్రారంభం కానుంది. ఈ కొత్త స్టోర్‌ ఫీనిక్స్ మాల్‌లో ఏర్పాటు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెప్టెంబర్ 2కి బెంగళూరులో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్‌