
Byjus : బైజూస్‌కు షాక్.. ఎగవేత కేసులో రుణదాతల చర్యలను సమర్థించిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌ేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ మేరకు ఎగవేతకు సంబంధించి ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న బైజూస్ సంస్థకు చెందిన ఓ యూనిట్‌ను రుణదాతలు తమ అధీనంలోకి తీసుకున్నారు.
అయితే దీనిపై తాజాగా డెలావెర్ కోర్టు తీర్పినిచ్చింది. ఈ క్రమంలోనే రుణదాతల చర్యలను న్యాయస్థానం సమర్థించింది.
ఈ సందర్భంగా కంపెనీకి చెందిన ఓ యూనిట్‌ను రుణదాతల గ్రూప్ తమ అధీనంలోకి తీసుకోవడాన్ని డెలావెర్ ఛాన్స్‌రీ కోర్టు ఓకే చెప్పింది.
ఈ మేరకు బైజూస్ పలుసార్లు రుణ చెల్లింపు నిబంధనలను ఉల్లంఘించిందని కోర్టు నిర్ధారించింది.
బైజూస్‌కు రెడ్‌వుడ్ ఇన్వెస్ట్‌మెంట్స్, సిల్వర్ పాయింట్ క్యాపిటల్ తో పాటు ఇంకొన్ని సంస్థలు 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించాయి.
details
మా ప్రయోజనాల కోసమే బైజూస్ ఆల్ఫాను హోల్డింగ్ కంపెనీగా మార్చాం : రుణదాతలు
కానీ, కొవిడ్ పరిస్థితుల కారణంగా ఎడ్‌టెక్ బిజినెస్ మొత్తం కుదేలైంది. దీంతో సంస్థ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ఫలితంగా బైజూస్ వాయిదాలను సక్రమంగా చెల్లించలేక చేతులెత్తేసింది. ఈ చర్య రుణ ఎగవేతకు దారితీసింది.
ఇక నిబంధనల మేరకు రుణదాతలు ఎంపిక చేసిన టిమోతీ పోల్ అనే వ్యక్తి కంపెనీకి చెందిన 'బైజూస్ ఆల్ఫా'లో ఏకైక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం రుణ షరుతల ప్రకారమే సాగిందని తాజాగా కోర్టు తేల్చింది.
ఆయా నియామకాన్ని సవాల్ చేస్తూ బైజూస్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ క్రమంలోనే కంపెనీ రుణ అవసరాల నిమిత్తంవ ఏర్పాటైన 'స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV)' బైజూస్ ఆల్ఫాను హోల్డింగ్ కంపెనీలా మార్చుకున్నట్లు రుణదాతల తరఫున న్యాయవాది వెల్లడించారు.