Page Loader
పతనమైన చైనా అంతర్జాతీయ వాణిజ్యం.. సెప్టెంబర్‌లో 6.2 శాతం క్షీణించిన వృద్ధి
సెప్టెంబర్‌లో 6.2 శాతం క్షీణించిన వృద్ధి

పతనమైన చైనా అంతర్జాతీయ వాణిజ్యం.. సెప్టెంబర్‌లో 6.2 శాతం క్షీణించిన వృద్ధి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 13, 2023
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా వివిధ సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించిన తర్వాత చైనా ఎగుమతులకు డిమాండ్ పతనమైంది. ఆర్థిక పునరుద్ధరణ, డ్రాగన్ చైనా ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కొవిడ్ మహమ్మారి నుంచి గ్లోబల్ ఎకానమీ (ప్రపంచ ఆర్థిక వ్యవస్థ) అస్థిరమైన క్రమంలో వాటి నుంచి తిరిగి పుంజుకోవడం, చైనా ఎగుమతులకు అతిపెద్ద సవాలుగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ప్రతినిధి లూ డాలియాంగ్ వివరించారు. భారతదేశంలోని ఆర్బీఐ సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్, యూరప్, ఆసియాలోని బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గత సంవత్సరం వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో చైనా ఎగుమతులకు డిమాండ్ తగ్గిపోయింది.

DETAILS

అప్పులు తిరిగి చెల్లించేందుకు డెవలపర్‌లకు ఇక్కట్లు 

కేంద్రీయ బ్యాంకుల విధానపరమైన నిర్ణయాలు ఇటీవలే అమలు చేసిన తర్వాత క్రమంగా చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ బ్యాంక్ రుణాలు తీసుకునే నిబంధనలను సడలించింది. మొదటిసారిగా గృహ కొనుగోలుదారుల కోసం వడ్డీ రేట్లను సైతం తగ్గించింది. అదే సమయంలో చిన్న వ్యాపారాలకు పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది. అయినప్పటికీ, ఆస్తి రంగం ఆర్థిక వ్యవస్థ డ్రాపౌట్ గా మిగిలిపోయింది. ఈ మేరకు అమ్మకాలు క్షీణించి, రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు భారీ అప్పులను తిరిగి చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు.