Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @22,545.05
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనలు ఇప్పటికే మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
ఈ నేపథ్యంలో మార్కెట్ ఉద్ధృతికి సంబంధించి అనిశ్చితి నెలకొనడంతో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించారు.
ఫలితంగా సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. ఫైనాన్షియల్ స్టాక్స్‌లో కొనుగోలు మద్దతు కనిపించగా, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.
సెన్సెక్స్ ఉదయం 74,706.60 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 74,602.12) లాభాలతో ప్రారంభమైంది.
రోజంతా స్వల్ప శ్రేణిలో లాభనష్టాల మధ్య కదలాడి, ఇంట్రాడేలో 74,520.78 నుంచి 74,834.09 పాయింట్ల మధ్య వ్యత్యాసం చూపింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 73.22 డాలర్లు
చివరికి 10.31 పాయింట్ల లాభంతో 74,559.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 2.50 పాయింట్లు నష్టపోయి 22,545.05 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.21గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, జొమాటో, టాటా స్టీల్ షేర్లు లాభపడగా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 73.22 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 2,901 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.