Loading...
Office to Residential Conversions: సరికొత్త ట్రెండ్‌...ఇల్లుగా మారిపోతున్న ఆఫీసులు
సరికొత్త ట్రెండ్‌...ఇల్లుగా మారిపోతున్న ఆఫీసులు

Office to Residential Conversions: సరికొత్త ట్రెండ్‌...ఇల్లుగా మారిపోతున్న ఆఫీసులు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

కరోనా తర్వాత మారిన ఉద్యోగుల పని విధానం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొత్త మార్పులకు దారితీస్తోంది. ఒకప్పుడు ఉద్యోగులతో కిటకిటలాడిన ఆఫీస్‌ భవనాలు ఇప్పుడు నివాస గృహాలుగా మారుతున్నాయి. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని లా డిఫెన్స్‌ ప్రాంతం ఇందుకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది. అక్కడ తొమ్మిది అంతస్తుల లే డైమంట్‌ భవనంలో ప్రస్తుతం సుమారు 1,800 మంది పనిచేస్తున్నారు. ఈ మొత్తం భవనాన్ని అపార్ట్‌మెంట్లుగా మార్చేందుకు గ్రూపమా ఇమ్మొబిలియర్‌ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.

Details

ఆఫీసులకు తగ్గిన డిమాండ్‌.. ఇళ్లకు పెరిగిన ఆదరణ

కరోనా తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం పెరగడంతో పారిస్‌లో ఆఫీస్‌ స్థలాలకు డిమాండ్‌ గణనీయంగా తగ్గింది.

లా డిఫెన్స్‌ ప్రాంతంలో ప్రస్తుతం ఆఫీస్‌ భవనాల ఖాళీ స్థలాల రేటు 14 నుంచి 15 శాతానికి చేరింది.

గత ఐదారేళ్లలో పారిస్‌లో కార్యాలయ స్థలాల డిమాండ్‌ దాదాపు మూడో వంతు పడిపోయిందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు చెబుతున్నారు.

దీంతో ఖాళీ భవనాలను ఆదాయాన్ని తెచ్చే నివాస ప్రాజెక్టులుగా మార్చేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

Details

అమెరికా, లండన్‌లోనూ ఇదే ట్రెండ్

పారిస్‌ మాత్రమే కాదు.. న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డీసీ, లండన్‌ నగరాల్లోనూ ఈ మార్పు కనిపిస్తోంది.

న్యూయార్క్‌లో 8,310, వాషింగ్టన్‌లో 6,533 అపార్ట్‌మెంట్లకు సంబంధించిన ఆఫీస్‌ మార్పిడి ప్రాజెక్టులు ప్రణాళికలో ఉన్నాయి.

వాషింగ్టన్‌ 2028 నాటికి డౌన్‌టౌన్‌లో 15 వేల మంది కొత్త నివాసితులను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

లండన్‌లో ఆఫీస్‌ భవనాలను ఇళ్లుగా మార్చే ప్రాజెక్టులు కరోనా ముందు స్థాయితో పోలిస్తే 60 శాతం పెరిగాయి.

ADVERTISEMENT

Details

మార్పులకు అడ్డంకులు.. ప్రభుత్వ విధానాలే కీలకం

అయితే ఆఫీస్‌ను ఇల్లుగా మార్చడం అంత సులభం కాదు. సహజ వెలుతురు అందని భవనాల మధ్య భాగం, తక్కువ ఎత్తున్న పైకప్పులు, కొత్త నీటి పైపులైన్లు, అగ్నిమాపక భద్రత, పార్కింగ్‌ వంటి అంశాలు సవాళ్లుగా మారుతున్నాయి.

పన్ను రాయితీలు, అనుమతుల ప్రక్రియ సరళీకరణతో ఈ ప్రాజెక్టులకు ఊతం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పారిస్‌లో ఖాళీగా ఉన్న ఆఫీస్‌ భవనాల్లో కేవలం 2 శాతాన్నే మార్చగలమా? లేక 18 నుంచి 23 శాతం వరకు మార్చగలమా? అనేది ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంది.

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఈ మార్పు భవిష్యత్తులో కొత్త పెట్టుబడి అవకాశాలను సృష్టించనుంది.

ADVERTISEMENT