Page Loader
Fake 'PAN 2.0'scam alert: పాన్ కార్డ్ పేరుతో ఈ-మెయిల్.. ఫిషింగ్ ఈమెయిల్స్ గురించి పౌరులను హెచ్చరించిన ప్రభుత్వం.. 
పాన్ కార్డ్ పేరుతో ఈ-మెయిల్.. ఫిషింగ్ ఈమెయిల్స్ గురించి పౌరులను హెచ్చరించిన ప్రభుత్వం..

Fake 'PAN 2.0'scam alert: పాన్ కార్డ్ పేరుతో ఈ-మెయిల్.. ఫిషింగ్ ఈమెయిల్స్ గురించి పౌరులను హెచ్చరించిన ప్రభుత్వం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ప్రజలను పాన్ కార్డుతో సంబంధించి జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. 'PAN 2.0' పేరుతో వచ్చే ఫేక్ ఈమెయిల్స్ విషయంలో పన్ను చెల్లింపుదారులు అత్యంత జాగ్రత్త వహించాలని ప్రభుత్వ సూచిస్తోంది. ఈ మెయిల్స్‌లో ఏవైనా అనుమానాస్పద లింకులు కనిపించినట్లయితే, వాటి మీద క్లిక్ చేయొద్దని స్పష్టం చేసింది. ఈ మోసాలకు పాల్పడే వ్యక్తులు, ఆదాయపు పన్ను శాఖ కొత్తగా QR కోడ్‌తో కూడిన PAN కార్డును అందుబాటులోకి తెచ్చిందని చెబుతూ "కొత్త e-PAN ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు" అనే సందేశంతో ఫిషింగ్ ఈమెయిల్స్ పంపిస్తున్నారు. ఈ లింకులు క్లిక్ చేయడం వల్ల వినియోగదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

PIB ఫ్యాక్ట్ చెక్ చేసిన ట్వీట్ 

వివరాలు 

లింకులు లేదా ఫైల్ అటాచ్‌మెంట్స్ పట్ల అప్రమత్తం

ఈ నేపథ్యంలో, PIB ఫ్యాక్ట్ చెక్ వేదికగా ప్రజలను హెచ్చరిస్తోంది. గుర్తు తెలియని ఈమెయిల్స్ వస్తే, వాటిలోని ఇమెయిల్ అడ్రసులను ముందుగా పరిశీలించాల్సిందిగా సూచించింది. లింకులు లేదా ఫైల్ అటాచ్‌మెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి సందేశాలకు స్పందించకూడదని హితవు చెప్పింది. "ఆర్థిక, గోప్యమైన సమాచారాన్ని కోరే ఇమెయిల్స్‌కు ఏపాటికి స్పందించకూడదు. అలాగే ఈ రకమైన ఫిషింగ్ ఇమెయిల్స్, సందేశాలను తక్షణమే సంబంధిత అధికారులకి రిపోర్ట్ చేయాలి. తప్పుడు ఈమెయిల్స్, సందేహాస్పద కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్పందించడం చాలా ప్రమాదకరం" అని PIB ఫ్యాక్ట్ చెక్ హెచ్చరించింది.

వివరాలు 

ఇ-పాన్ డౌన్‌లోడ్ కోసం వచ్చిన లింకులపై క్లిక్ చేయద్దు 

ఇంకో ముఖ్యమైన అంశాన్నిఆదాయపు పన్ను శాఖ స్పష్టంగా తెలియజేసింది. వారు ఎప్పుడూ టాక్స్ పేయర్లను తమ పాస్‌వర్డ్‌లు,బ్యాంక్ ఖాతా నెంబర్లు లేదా క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వమని ఇమెయిల్ ద్వారా కోరే అవకాశం లేదని తెలిపింది. ఇ-పాన్ డౌన్‌లోడ్ కోసం వచ్చిన లింకులు,అనుమానాస్పద ఇమెయిల్స్ పై క్లిక్ చేయవద్దని స్పష్టం చేసింది. పాన్ కార్డుతో సంబంధించి ఏవైనా అనుమానాస్పద ఈమెయిల్స్ వచ్చినట్లయితే,అవి వెంటనే webmanager@incometax.gov.in లేదా incident@cert-in.org.in కు ఫార్వర్డ్ చేయాలని సూచించారు.

వివరాలు 

యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు, ఫైర్‌వాల్స్‌ను వినియోగించాలి

కొన్ని సందర్భాల్లో info@smt.plusoasis.com వంటి ఈమెయిల్స్ నుండి "PAN 2.0 Cards" పేరుతో మోసపూరిత మెసేజ్‌లు వస్తున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు అధికారిక సంస్థల రూపంలో కనిపించే వాస్తవిక వెబ్‌సైట్లు, ఇమెయిల్స్ సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి మోసాల నుండి రక్షణ పొందేందుకు తాజా యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు, ఫైర్‌వాల్స్‌ను వినియోగించాలి అని వారు సలహా ఇస్తున్నారు.